
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తి మృతి
దౌల్తాబాద్: పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవిగౌడ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని తిమ్మాయిపల్లికి చెందిన నర్సప్ప(48), భార్య లక్ష్మిపై గ్రామానికి చెందిన వైరివర్గం దాడి చేసింది. ఈ మేరకు దంపతులిద్దరూ ఘటన పై ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి బయట కూర్చున్నారు. ఛాతిలో నొప్పి వస్తోందని పడుకున్నాడు. భార్య ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలసుకున్న పోలీసులు మృతదేహాన్ని కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలను పిలిచి మాట్లాడుదామనే లోపు ఈ ఘటన చోటు చేసుకుందని.. కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.