
ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలి
‘స్థానిక’ ఎన్నికలకు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి చేపట్టనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యాచరణ సిద్ధమవుతోంది.
8లోu
9లోu
కొడంగల్ రూరల్: అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ పరిధిలో బూత్ లెవల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. మంగళవారం ఆయన పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అన్ని పార్టీల అధ్యక్ష్య, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పారీల్ట నాయకులు తమ పరిధిలో ప్రతీ అంశంపై సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్, ఎలక్షన్ డీటీ అనిత, ఆయా పార్టీల నాయకులు కృష్ణ, మాజీ సర్పంచ్ రమేశ్‌బాబు, ఇందనూర్ బషీర్, ఎస్‌బి.గుల్షన్, తలారి శేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతులు కల్పించాలి
అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ముఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. చాలా రూట్‌లలో బస్సులు లేక విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రవీందర్, నర్సింలు, శేఖర్, సత్యం, రాజు, రమేశ్, నవీన్ రాథోడ్ తదితరులు ఉన్నారు.
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
మధ్యాహ్న భోజనం తనిఖీ
బొంరాస్‌పేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. మెనూ ప్రకారం వంటలు చేయాలన్నారు. వర్షాకాలంలో ఎదురయ్యే కలుషిత ఆహార సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య వివరాలు తెలుసుకున్నారు. అంతకు ముందు మండల కేంద్రంలో నిర్వహించిన బీఎల్‌ఓలకు నిర్వహించిన అవగాహన సమావేశాన్ని పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన బీఎల్‌ఓ విధులను వివరించారు.