
విద్యాభివృద్ధిలో త ల్లిదండ్రులు కీలకం
జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి
తాండూరు రూరల్: విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు సైతం బాధ్యత తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గౌతపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల్లో హెచ్‌ఎం లీలావతి అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హారైన డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమై న విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థుల కు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతీ విద్యార్థిపై ఉపాధ్యా యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ వెంకటయ్య, గ్రామస్తులు నాగప్ప, రాజప్పగౌడ్, పురుషోత్తంరెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
క్షయపై ఆందోళన అనవసరం
ప్రోగ్రాం జిల్లా అధికారి రవీందర్‌యాదవ్
తాండూరు రూరల్: క్షయ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీబీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ రవీందర్ యాదవ్ అన్నారు. మంగళవారం జినుగుర్తి గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. టీబీ వ్యాధి సోకిన వారు ఆరు నెలలు క్రమం తప్పకుండా మందులు వాడితే నివారించవచ్చన్నారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో జినుగుర్తి పీహెచ్‌సీ డాక్టర్ రశీద్, ఏఎన్‌ఎంలు కరుణశీల, నర్మద, సుశీల, ఆశవర్కర్లు లలిత, రాములమ్మ పాల్గొన్నారు.
దివ్యాంగులకు
రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలి
వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు
శ్యాంప్రసాద్
అనంతగిరి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు వినతిపత్రం అందజేశారు. వంద శాతం సబ్సిడీతో రుణాలు అందజేసి జీవనోపాధి కల్పించాలన్నారు. ప్రతీ దివ్యాంగుడికి రూ.50లక్షల ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు.
ఫ్యూచర్‌సిటీతో మహర్దశ
యాచారం: ఫ్యూచర్‌సిటీతో యాచారానికి మహర్దశ పట్టనుందని, కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశ్వనగరం వై పే ప్రపంచ చూపు ఉందని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నస్దిక్‌సింగారం, అయ్యవారిగూడెం, యాచారం గ్రామాల్లో మంగళవారం ఆయన రూ. 2.5 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ ఫార్మాసిటీ నిర్మించి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తే, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యూచర్‌సిటీ నిర్మించి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా కృషి చేస్తున్నారని అన్నారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు ఈసీ శేఖర్‌గౌడ్, బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ, యాచారం మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీలు రాంరెడ్డి, శ్రీనువాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధిలో త ల్లిదండ్రులు కీలకం