బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025

Jul 9 2025 7:42 AM | Updated on Jul 9 2025 7:42 AM

బుధవా

బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025

8లోu

వికారాబాద్‌: వారం రోజులుగా ఊరిస్తున్న మేఘాలు చిరు జల్లులకే పరిమితమవుతున్నాయి. మొదట్లో అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు విత్తనాలు వేసుకున్నారు. ఆ వెనువెంటనే వరుణుడు మొహం చాటేడయంతో ఆందోళన చెందుతున్నారు. సీజన్‌ ఆరంభంలోనే విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లు చేసి ఇళ్లకు తెచ్చుకున్నారు. పూర్తి స్థాయిలో విత్తనాలు వేసేందుకు సరిపడా వర్షాల కురవడం లేదు. 60 మిల్లీ మీటర్ల వర్షపాతం కోసం రెండు నుంచి మూడు పెద్ద వర్షాలు కురిస్తేనే పూర్తి స్థాయిలో విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 5.61 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. సాధారణ వర్షపాతంతో విత్తనాలు వేసేందుకు సరిపోవడం లేదని పూర్తి స్థాయిలో కురిసిన తర్వాతే విత్తుకుంటే మేలని అధికారులు సూచిస్తున్నారు.

పెసర, మినుము, జొన్న వద్దు

ముందుస్తుగా వర్షాలు కురిస్తే రోహిణి లేదంటే మృగశిర కార్తెలో విత్తనాలు విత్తుకుంటారు. ఈ ఏడాది మే 24న రోహిణి కార్తె ప్రారంభమైంది. జిల్లా వ్యాస్తంగా 5.61 లక్షల ఎకరాలు సాగవనుండగా ఇప్పటి వరకు 3.11లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేశారు. ఈ సీజన్‌లో ప్రస్తుతం 60 శాతం విత్తనాలు వేయగా 40 శాతం రైతుల ఇళ్లలోనే మగ్గుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెసర, మినుము, జొన్న విత్తనాలు వేయకపోవడమే మేలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల మొలకలు రాకపోగా అక్కడక్కడా విత్తనాలు మొలకెత్తాయి. మరికొన్ని చోట్ల కలుపుతీతకు సిద్ధంగా ఉన్నాయి. మెజార్టీ రైతులు మొలకలు వస్తాయా రావా? అని ఆందోళన చెందుతున్నారు.

న్యూస్‌రీల్‌

వానాకాలం సీజన్‌ ప్రారంభమై నెల రోజులు దాటినా చినుకు జాడ లేదు. ముందస్తు వర్షాలు రైతును మురిపించినా ఆతర్వాత ఆకాశం వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఒక్క పెద్ద వాన కూడా కురువక సాగు ముందుకు కదలడం లేదు.

సాగుకు సరిపడా కురవని వర్షాలు

40 శాతం విత్తనాలు ఇళ్లకే పరిమితం

ప్రారంభం కాని వరినాట్లు

ఆందోళనలో రైతులు

వరి సాగుకు ఆందోళన

గతేడాది వర్షాకాలంలో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8వేల ఎకరాల్లో నారుపోసుకున్నారు. వర్షాల జాడ లేక చెరువుల్లోకి నీరు రాలేదు. దీంతో రైతులు వరి నారుకు పోయాలా.. వద్దా అనేది తేల్చుకోలేకపోతున్నారు. బోరుబావులు ఉన్న వారు మాత్రం వరి నారు పోసుకున్నారు.

వరి సాగుకు ఆందోళన

గతేడాది వర్షాకాలంలో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8వేల ఎకరాల్లో నారుపోసుకున్నారు. వర్షాల జాడ లేక చెరువుల్లోకి నీరు రాలేదు. దీంతో రైతులు వరి నారుకు పోయాలా.. వద్దా అనేది తేల్చుకోలేకపోతున్నారు. బోరుబావులు ఉన్న రైతులు మాత్రం వరి నారు పోసుకున్నారు.

పత్తి సాగుకే మొగ్గు

జిల్లాలో 16 రకాల పంటలు సాగు చేస్తుండగా ఇందులో సింహభాగం పత్తి, కంది, మొక్కజొన్న, వరి పైర్లు వేస్తున్నారు. గతేడాది పత్తి క్వింటాల్‌కు రూ.8 వేలకు పైగా ధర రావడంతో రైతులు పత్తిసాగుకు మొగ్గు చూపుతున్నారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2.5 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికి 1,98,926 ఎకరాల్లో సాగు చేశారు. 80,428 ఎకరాల్లో కంది సాగు చేశారు. మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గతంలో 30–60 వేల ఎకరాల్లో సాగు చేసే మొక్కజొన్న ఇప్పటి వరకు 14,755 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. కోతుల బెడద ఎక్కువైన నేపథ్యంలో కూరగాయలు, వేరుశనగ సాగు విస్తీర్ణం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

నెలాఖరు వరకు ఓకే

ఈ నెలాఖరు వరకు అన్ని రకాల విత్తనాలు విత్తుకోవచ్చు. ఎక్కువ శాతం పత్తి, కంది సాగుకు మొగ్గు చూపుతున్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. లోటు వర్షపాతం కారణంగా విత్తనాలు విత్తుకోవడం పూర్తవలేదు.

– మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 20251
1/2

బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025

బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 20252
2/2

బుధవారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement