
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
తాండూరు రూరల్: పాఠశాలకు ఉపాధ్యాయలు సమయపాలన పాటించాలని పెద్దేముల్ ఏంఈఓ నర్సింగ్‌రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని బండపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏంఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు అందజేసిన పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాంలకు సంబంధించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలన్నారు. వర్షాకాలం సందర్భంగా మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సందడిగా పీర్ల ఊరేగింపు
దుద్యాల్: మండల పరిధిలోని కుదురుమల్లలో మొహర్రం ఊరేగింపును సోమవారం ఘనంగా నిర్వహించారు. చావిడిలో ఏర్పాటు చేసిన పీర్లను 10వ రోజు గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. దీంతో గ్రామస్తులు ఊదు, బెల్లం చదివింపులు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు, యువకులు, గ్రామస్తులు ఆటపాటలతో సందడి చేశారు.
మొహర్రం ఉత్సాహం
బొంరాస్‌పేట: మండల పరిధిలోని పలు గ్రా మాల్లో సోమవారం మొహర్రం సందడి నెలకొంది. వడిచర్ల, నాగిరెడ్డిపల్లి, రేగడిమైలారం గ్రామాల్లో పీర్లను ఊరేగించి సాయంత్రం నిమజ్జనం చేశారు. చిన్నాపెద్ద ఆడిపాడారు.
పరిగి తహసీల్దార్‌పై
చర్యలకు డిమాండ్
అనంతగిరి: అక్రమాలకు పాల్పడిన పరిగి తహసీల్దార్ ఆనంద్‌రావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి అవినీతికి పాల్పడిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు. విచారణ పేరుతో కాలాయాపన చేయడం తగదన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బుగ్గప్ప, వెంకటయ్య, శ్రీనివాస్, చంద్రయ్య, శ్రీనివాస్‌నాయక్, మల్కయ్య తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం
అందించాలి
మర్పల్లి: ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుకునే పేద విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని మర్పల్లి ఎంపీడీఓ రాజ్ మల్లయ్య సూచించారు. సోమవారం మండల పరిధిలోని పట్లూర్ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారని వార్డెన్ తుల్జారామ్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 30 మంది విద్యార్థులు ఉన్నారని బదులిచ్చారు. అనంతరం వసతి గృహంలో ఉన్న రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఏవైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు.

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి