
సర్కార్ బడుల బలోపేతానికి కృషి
పూడూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కంకల్ ప్రభుత్వ పాఠశాలకు జిల్లా అధికార ప్రతినిధి కొండాల రవీందర్ రూ.30 వేలు వెచ్చించి సీసీ కెమెరాలను అందజేశారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. ఉన్న ఊరుకు, చదువుకున్న పాఠశాలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరప్ప 200 రకాల పుస్తకాలను లైబ్రరీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీశైలం, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణాచారి, నాయకులు మాణిక్యం, రవి, నర్సింలు, నవీన్, వెంకటేశ్ పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి