
చండీయాగాన్ని జయప్రదం చేయండి
పరిగి: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నగరంలోని తుల్జాభావన్ ధర్మశాలలో నిర్వహించనున్న పంచకుండాత్మక చండీయాగం, కుబేరపాశుపత యాగాలను జయప్రదం చేయాలని దూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థచారి కోరారు. సోమవారం పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో జిల్లా డీడీఎన్‌ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14, 15, 16 తేదీల్లో డీడీఎన్‌ఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించనున్నట్టు తెలిపారు. అర్చకులు నియమ నిబంధనలు పాటిస్తూ దేవాలయాల్లో దూప దీప నైవేద్యాలను సమర్పిస్తూ ప్రజలకు తీర్థప్రసాదాలను అందించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కల్యాణ్‌రావు, కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, సభ్యులు శివానందం, అఖిలేష్, నటరాజేశ్వర్, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
డీడీఎన్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జయతీర్థ చారి