ప్రజారోగ్యంౖపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంౖపై దృష్టి పెట్టాలి

Jul 5 2025 9:29 AM | Updated on Jul 5 2025 9:29 AM

ప్రజా

ప్రజారోగ్యంౖపై దృష్టి పెట్టాలి

● సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ● డీఎంహెచ్‌ఓ లలితాదేవి ● పలు ఆస్పత్రుల సందర్శన

కొడంగల్‌: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ లలితాదేవి అన్నారు. శుక్రవారం మండలంలోని అంగడిరాయిచూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగాసందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సీజన్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. రోగులకు అందుబాటులో ఉంటూ సత్వర సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రవీంద్రయాదవ్‌, డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, డాక్టర్‌ ఫాతిమా, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

దౌల్తాబాద్‌: ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అఽధికారి లలితాదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు. నెలలు నిండిన గర్భిణులను ముందస్తుగా ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్‌యాదవ్‌, వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌, పీహెచ్‌సీ వైద్యాధికారిణి అమూల్య ఉన్నారు.

రోగులకు ఇబ్బంది కలగొద్దు

దుద్యాల్‌: ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని డీఎంహెచ్‌ఓ లలితాదేవి సూచించారు. శుక్రవారం మండలంలోని హకీంపే ట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, స్టాక్‌ వివరాలుపరిశీలించారు.

మెరుగైన వైద్యం మన బాధ్యత

బొంరాస్‌పేట: రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత అని డీఎంహెచ్‌ఓ లలితాదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆమె సందర్శించారు. వసతులపై ఆరా తీశారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీంద్రయాదవ్‌, మండల వైద్యాధికారి హేమంత్‌, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

ప్రజారోగ్యంౖపై దృష్టి పెట్టాలి 1
1/1

ప్రజారోగ్యంౖపై దృష్టి పెట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement