బాలికలను వేధిస్తే జైలుకే | - | Sakshi
Sakshi News home page

బాలికలను వేధిస్తే జైలుకే

Jul 4 2025 6:49 AM | Updated on Jul 4 2025 6:49 AM

బాలిక

బాలికలను వేధిస్తే జైలుకే

తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి

చట్టాలపై విద్యార్థులకు అవగాహన

తాండూరు రూరల్‌: పాఠశాలలు, కళాశాలల వద్ద బాలికలను వేధిస్తే జైలుకు పంపిస్తామని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాల్యం నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కష్టపడి చదివి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. బాలికలను వేధిస్తే పోక్సో చట్టం కింద జైలుకు పంపిస్తామన్నారు. మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ సీఐ నగేష్‌, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ శ్రీదేవి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

గుండెపోటుతో ఏఎంసీ డైరెక్టర్‌ మృతి

తాండూరు రూరల్‌: గుండెపోటుతో మండలంలోని అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్‌కు చెందిన తాండూరు మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ భగవాన్‌ కరీం(60) మృతి చెందారు. ఈ సంఘటన గురువారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భగవాన్‌ కరీం తన సోదరి అంత్యక్రియల కోసం కర్ణాటకకు వెళ్లారు. అక్కడే ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని స్వగ్రామం దస్తగిరిపేట్‌కు తరలించారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ బాల్‌రెడ్డితో పాటు డైరెక్టర్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

బైండోవర్‌లో ఉన్న వ్యక్తికి రిమాండ్‌

పరిగి: మండల పరిధిలోని సాలిప్పలబాటతండాకు చెందిన డెగావత్‌ నీల్యనాయక్‌ గత 6 నెలల క్రితం సారా తయారీ చేస్తుండగా ఆబ్కా రీ పోలీసులు పట్టుకున్నారు. ఆయన్ని పరిగి తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసి మళ్లీ సారా తయారు చేయరాదని హెచ్చరించారు. అయి నా అతనిలో మార్పు రాకుండా నిత్యం అదే పనిగా సారా తయారీ చేస్తున్నాడు. దీంతో గురువారం తహసీల్దార్‌ ఆనంద్‌రావు బైండోవర్‌ను ఉల్లంఘించినందుకు రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. బైండోవర్‌లో ఉన్న వ్యక్తులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

పన్నులు సకాలంలో చెల్లించాలి

కుల్కచర్ల: ట్యాక్స్‌ ప్లేట్‌ గల వాహనదారులు తమ వాహనాల పన్నులను తప్పనిసరిగా సకాలంలో చెల్లించాలని పరిగి ఆర్టీఓ వీరేంద్రనాయక్‌ సూచించారు. గురువారం మండల కేంద్రంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో ఐదు వాహనాలను సీజ్‌ చేశారు. వాటిపై రూ.లక్ష 10వేల ట్యాక్స్‌ ఉందని తెలిపారు. అనంతరం వాహనాలను కుల్కచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వీరేంద్రనాయక్‌ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనదారులకు ఉన్న ట్యాక్స్‌ను చెల్లించాలని, నిబంధనలను అనుసరించి నడపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం స్వాధీనం

కాచిగూడ: గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ నరేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ, కృష్ణానగర్‌ నాలాలో గుర్తుతెలియని వ్యక్తి (45) మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలికలను వేధిస్తే జైలుకే 1
1/3

బాలికలను వేధిస్తే జైలుకే

బాలికలను వేధిస్తే జైలుకే 2
2/3

బాలికలను వేధిస్తే జైలుకే

బాలికలను వేధిస్తే జైలుకే 3
3/3

బాలికలను వేధిస్తే జైలుకే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement