
పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు
పరిగి: పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తిస్తుందని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసే వారు పార్టీలో పదవుల కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీచేసే వారే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని సూచించారు. పార్టీ ఎవరికీ టికెట్ కేటాయించిన గెలిపించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అందిస్తున్న సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇటీవల ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలు అందజేశామని అందరితో మాట్లాడి పార్టీ అభ్యర్థులు గెలిచేల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం మాజీ ప్రధాని పీవి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌రెడ్డి, కో ఆబ్జర్వర్ నరేందర్, బ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు అశోక్, ఆంజనేయులు, తౌరియా, ఆయూబ్, ఆనంద్, నాగవర్థన్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం...
దోమ: కాంగ్రెస్ బలోపేతం చేయడమే లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం దోమ మండల కేంద్రంలో కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతుందన్నారు. రానున్నరోజుల్లో కార్యకర్తలు కష్టపడి పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, శాంతకుమార్, బద్రి, డీసీసీ ఉపాధ్యక్షుడు రాములు, జాకటి వెంకటయ్య, శివకుమార్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, బంగ్ల యాదయ్య, అంతిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమేష్ గౌడ్, బాల్‌రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి