
అనుమతులు లేనివి ఎన్నో?
నస్కల్ గ్రామంలో అనుమతులు లేకుండా చేసిన వెంచర్
జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని లేఅ వుట్లు చాలానే ఉన్నాయి. దాదాపు 550 వరకు ఉన్నట్లు సమాచారం. వీటిలో వేల మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రుసుం చెల్లించి ప్లాట్లు, వెంచర్లు రెగ్యులరైజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల నుంచి 20,900 దరఖాస్తులు వచ్చాయి. 594 గ్రామ పంచాయతీల నుంచి 16,095 అర్జీలు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఇచ్చిన గడువు మే 3వ తేదీ నాటికి దరఖాస్తుదారుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కేవలం 17 శాతం మంది మాత్రమే ఫీజు చెల్లించి తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకున్నారు. 36,995 దరఖాస్తుల్లో 6,207 మంది తమ ప్లాట్లను క్రమబద్ధ్దీకరించుకున్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.19.8 కోట్ల ఆదాయం సమకూరింది. తాండూరు మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా 12,259 దరఖాస్తులు వచ్చినా కేవలం 1,387 మంది మాత్రమే పాట్లను రెగ్యులరైజేషన్ చేసుకున్నారు.