అనంతగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ అన్నారు. ఈమేరకు బుధవారం వికారాబాద్‌లోని సీఐటీయూ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు వ్యతిరేకంగా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025 ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరి మరోసారి వెల్లడయిందన్నారు. దేశంలో ఉన్న సామాన్య ప్రజలు, కార్మిక వర్గంపై అనేక భారాలు మోపుతూ కార్పొరేట్‌కు వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. ఉపాధి హామీకి నిధుల కోత పెట్టిందన్నారు. ఉద్యోగాల భర్తీకి ఎలాంటి ప్రణాళికలేవన్నారు. బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిందన్నారు. కార్మిక లోకంకు చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకటయ్య, చంద్రయ్య, రామకృష్ణ, బుగ్గప్ప, మంగమ్మ, ఉమాదేవి, యాదమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్