గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు
దుద్యాల్: గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని కుదురుమల్ల గ్రామంలో పర్యటించారు. ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామానికి అవసమరైన మౌలిక వసతులు గుర్తించి వెంటనే నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైనేజీ, పాఠశాల, పంచాయతీ భవనాల నిర్మాణం అవసరమని గ్రామస్తులు వెంకట్‌రెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేఖర్, మాజీ సర్పంచ్ రఘుపతి, కాంగ్రెస్ నాయకులు, గ్రాసమ్తులు ఉన్నారు.
రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటడం హర్షణీయం
కొడంగల్ రూరల్ : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి వీరేశంతోపాటు పాఠశాల పీడీ అజీజ్‌ను సోమవారం పాఠశాల ఆవరణలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్ కుమార్ సన్మానించారు. ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెఢరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో రన్నరప్‌గా నిలిచిన రంగారెడ్డి జిల్లా జట్టులో విద్యార్థి వీరేశం ఆడాడని పాఠశాల సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం మురళీధర్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి


