పాములకాలువలో ఈ మృతుడెవరో? | - | Sakshi
Sakshi News home page

పాములకాలువలో ఈ మృతుడెవరో?

May 21 2026 10:19 AM | Updated on May 21 2026 10:19 AM

సూళ్లూరుపేట: తడ మండలం కాదలూరు వద్ద పాములకాలువ నీటిలో గుర్తు తెలియని మృతదేహం బుధవారం గుర్తించారు. నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు తడ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి సుమారు 45 ఏళ్లు ఉంటుందని, ఇతను చనిపోయి మూడు రోజులు అయివుంటుందని పోలీసులు తెలిపారు. మృతుడు బ్లూకలర్‌ టీషర్టు , నలుపురంగు లుంగీ ధరించి ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కొండపనాయుడు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement