వ్యక్తిపై దాడి | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై దాడి

May 21 2026 10:19 AM | Updated on May 21 2026 10:19 AM

దొరవారిసత్రం: కల్లూరు గ్రామానికి చెందిన సురేష్‌ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన నలుగురు దాడి చేసి గాయపరిచిన ఘటన మంగళవారం చోటు చేసుకోగా బుధవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు.. పాతకక్షలు కారణంగా సురేష్‌ ఇంటి వద్దకు అదే గ్రామానికి చెందిన మస్తాన్‌, ప్రవీణ్‌, లోకేష్‌, అఖిల్‌ వచ్చి, దుర్బాషలాడి ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో సురేష్‌కు గాయాలయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారిస్తున్నారు.

నిందితుడిపై పీడీ యాక్ట్‌

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో నిందితుడైన తమిళనాడుకు చెందిన రామకృష్ణన్‌ ముత్తు ఎలియాస్‌ రామకృష్ణపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పీడీ యాక్ట్‌ అమలు చేశారు. స్మగ్లింగ్‌ పాల్పడుతున్న వారిపై టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ అమలులో భాగంగా టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏఎస్పీ జె కులశేఖర్‌ మార్గదర్శకత్వంలో పీడీ యాక్ట్‌లు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన నిందితుడు రామకృష్ణన్‌ ముత్తు ఎలియాస్‌ రామకృష్ణపై పీడీ యాక్ట్‌ అమలుకు సిఫారసు చేశారు. ఈ మేరకు కలెక్టరు వెంకటేశ్వర్‌ పీడీ యాక్ట్‌ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు రామకృష్ణపై ఏడు ఎరచ్రందనం కేసులు ఉండగా, టాస్క్‌ఫోర్స్‌లో నాలుగు, సుండుపల్లి, కలికిరి పోలీసు స్టేషన్లుతో పాటు, పీలేరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లో ఒక్కొక్క కేసు ఉంది. పీడీ యాక్ట్‌ అమలులో భాగంగా నిందితుడిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

లారీ కింద పడి

కార్మికుడి మృతి

నాయుడుపేటటౌన్‌: మండలంలోని మేనకూరు సెజ్‌లో ఉన్న ఎస్‌ఆర్‌ఆర్‌ పరిశ్రమలో పనిచేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన కార్మికుడు ప్రమాదవశాత్తు లారీ కిందపడి మంగళవారం రాత్రి మృతి చెందాడు. మేనకూరు పరిశ్రమల కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ పరిశ్రమలో చైన్నెకి చెందిన అరుపయ్య అలీయాస్‌ శివ(36) అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పరిశ్రమలో పనిచేస్తుండగా కదిలి వెళుతున్న లారీ ఎక్కుతుండగా జారి లారీ వెనుక చక్రల కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడడంతో కార్మికుడిని హుటాహుటిన నెల్లూరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి రేవతి బుధవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రాపూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

రాపూరు: పట్టణంలోని పాత ఎస్టీ హాస్టల్‌ భవనంపై గుర్తు తెలియని మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఐదురోజులుగా దుర్వాసన వస్తుండడంతో చుట్టపక్కల నివాసాలు ఉన్న వారు అనుమానంతో పాత హాస్టల్‌ భవనం మిద్దిపైకి ఎక్కి పరిశీలించారు. అక్కడ ఇక వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండం చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తిరుమలరావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే మృతదేహం పక్కన ఖాళీ మద్యం సీసా, వాటర్‌ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతుడు ఐదు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement