నెయ్యికి బదులు వంట నూనె వడ్డింపు | - | Sakshi
Sakshi News home page

నెయ్యికి బదులు వంట నూనె వడ్డింపు

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

– ఓ కుటుంబానికి అస్వస్థత

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దర్శనానర్థం ఆదినారాయణ కుటుంబం శ్రీకాళహస్తికి విచ్చేశారు. తిరుగు ప్రయాణంలో వారు పట్టణంలోని రైల్వేస్షేషన్‌ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్‌ హోటల్‌లో భోజనం చేశారు. అయితే అక్కడ టేబుల్‌పై నెయ్యికి బదులు వంట నూనె ఉంచడంతో ఆయన భార్య, పిల్లలు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీనిపై హోటల్‌ నిర్వాహకులను ప్రశ్నించగా వారు దురుసుగా సమాధానం చెప్పడంతో పాటు తమపై దాడికి యత్నించినట్లు బాధితుడు తెలిపాడు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేసి హోటల్‌ నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement