‘‘న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అనేక ఏళ్లుగా కోరుతున్నాం. ప్రతిసారీ ఏదో ఒకటి చెబుతున్నారు. ఇప్పుడు 62 రోజులుగా నిరసన తెలుపుతున్నాం. అధికారుల్లో చలనం లేదు. కల్లబొల్లి మాటలతో మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారు. కార్మికులంటే అంత చిన్నచూపు ఎందుకు? సమస్యలు పరిష | - | Sakshi
Sakshi News home page

‘‘న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అనేక ఏళ్లుగా కోరుతున్నాం. ప్రతిసారీ ఏదో ఒకటి చెబుతున్నారు. ఇప్పుడు 62 రోజులుగా నిరసన తెలుపుతున్నాం. అధికారుల్లో చలనం లేదు. కల్లబొల్లి మాటలతో మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారు. కార్మికులంటే అంత చిన్నచూపు ఎందుకు? సమస్యలు పరిష

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

● కార్మికుల నినాదాలతో అట్టుడికిన స్విమ్స్‌ ● మండుటెండలో డెరెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా ● కార్మికుల కట్టడికి పోలీసులను మోహరించిన అధికారులు

– 8లో

న్యూస్‌రీల్‌

స్విమ్స్‌, టీటీడీ అధికారులకు కార్మికుల హెచ్చరిక

గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

పరిష్కారమా..

తిరుపతి తుడా: స్విమ్స్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేశారు. 62 రోజులుగా నిరసన తెలుపుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడంతో వర్క్‌ టు రూల్‌ను పాటిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం స్విమ్స్‌ డైరెక్టర్‌ కార్యాలయం వద్ద మండుటెండలో ధర్నాకు దిగారు. అధికారులు టీటీడీ సెక్యూరిటీ, స్థానిక పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో స్విమ్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సీఐటీయూ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అధికారులతో చర్చలు విఫలం...

ధర్నా అనంతరం స్విమ్స్‌ డైరెక్టర్‌, యాజమాన్యంతో సీఐటీయూ నేతలు, కార్మికులు చర్చలు జరిగాయి. సమస్యను వెంటనే టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, కొంత సమయం ఇవ్వాలని యాజమాన్యం కోరింది. దీనిపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదని మండిపడ్డారు. తక్షణం సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటం ఉద్ధృతం చేస్తామని తేల్చిచెప్పారు. చర్చలు విఫలం కావడంతో కార్మికులు యథావిధిగా సమ్మెలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు బాలసుబ్రమణ్యం, జయచంద్ర, వేణుగోపాల్‌, ఆర్‌.లక్ష్మీ, మునిరాజ, ఎన్‌.మాధవ్‌, బుజ్జి, బిల్డింగ్‌ వర్కర్స్‌ నగర కార్యదర్శి శ్రీరాములు, నారాయణస్వామి, టీటీడీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సిద్ధు, ప్రభాకర్‌, కేశవులు, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు నరేంద్ర, స్విమ్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి రవి, అధ్యక్షులు సూరి, మారి ముత్తు, వెంకటేష్‌, కోటయ్య, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు

స్విమ్స్‌ డైరెక్టర్‌ కార్యాలయం వద్ద మండుటెండలో

కార్మికుల నిరసన

ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం

స్విమ్స్‌లో పనిచేస్తున్న కార్మికుల బతుకులు అధ్వానంగా ఉన్నాయి. సమస్యలు పరిష్కరించా లని అధికారులకు పలు మార్లు విన్నవించినా పట్టించుకోలేదు. కల్లబొల్లి మాటలతో మభ్యపెడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ధర్నాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. సమస్య పరిష్కారం కోసం ప్రాణాలైనా అర్పించేందుకు కార్మికులం సిద్ధంగా ఉన్నాం.

– రవి, వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి, స్విమ్స్‌

సమస్య పరిష్కరించే వరకు

ఉద్యమిస్తాం

కార్మికులంటే అధికాారులు చులకనగా ఉంది. కొన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కార్మిక సంఘాలు, సీఐటీయూ నేతలు పలుమార్లు అధికారులతో చర్చలు జరిపినా మభ్యపెట్టే మాటలు తప్ప సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదు. మా సహనాన్ని పరీక్షించొద్దు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదు. – సుజాత, కార్మికురాలు, స్విమ్స్‌

ఇది బతుకు పోరాటం

కొన్నేళ్ల నుంచి రోగులకు సేవ చేస్తున్నాం. శానిటరీ హోదాను రద్దు చేసి వార్డ్‌ బాయ్స్‌ హోదా ఇచ్చి వేతనాలు పెంచాలని అడుగుతున్నాం. చిన్న సమస్యను పరిష్కరించేందుకు కూడా అధికారులు చొరవ చూపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మావి గొంతెమ్మ కోరికలు కాదు. బతుకు పోరాటం మాత్రమే. సమస్య పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తాం.

– జయమ్మ, వర్క్‌ర్స్‌ యూనియన్‌ సభ్యురాలు, స్విమ్స్‌

పూట గడవని పరిస్థితి

స్విమ్స్‌లో పనిచేస్తున్న మా పరిస్థితి దారుణంగా ఉంది. పూట గడవని స్థితిలో కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. మేము చేస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూస్తున్న అధికారులు హోదాను మార్చి వేతనాలు పెంచేందుకు ఎందుకు సహరించడం లేదో అర్థం కావడం లేదు. సుమారు రెండేళ్లుగా పోరాటం చేస్తున్నా టీటీడీ అధికారులు స్పందించక పోవడం దారుణం.

– బృంద, కార్మికురాలు, స్విమ్స్‌

Advertisement
 
Advertisement
Advertisement