కిడ్నాప్‌పై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌పై ఫిర్యాదు

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

సైదాపురం: అప్పు చెల్లించలేదని గిరిజన కుటుంబ సభ్యులను యాజమాని కిడ్నాప్‌ చేశారని బుధవారం సైదాపురం పోలీసులకు బాఽధితులతో కలిసి సీపీఎం నేతల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. గిరిజనుల కథనం మేరకు.. సైదాపురంలోని ఎంఎస్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఎం అంకయ్య, పద్మమ్మ బతుకుదెరువు కోసం రైల్వేకోడూరు సమీపంలో ఓ భూస్వామి వద్ద పనులకు వెళ్లారు. అనారోగ్యం కారణంగా ఇంటికి పోతామని బాధితులు యాజమానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఈనెల 6వ తేదీన కోడూరు నుంచి సొంతూరికి రాత్రికి రాత్రే వచ్చేశారు. దీంతో అగ్రహించిన ఇటుక బట్టీల యజమాని కుమారులు సైదాపురంలోని బస్టాండ్‌కు చేరుకుని అంకయ్య, పద్మమ్మల కుమారులను కిడ్నాప్‌ చేశాని పోలీసులకు ఫిర్యాదు చేశారని సీపీఎం ఇన్‌చార్జీ పీ శ్రీనివాసులు తెలిపారు.

న్యాయం చేయండి

రేణిగుంట: జన్మనిచ్చిన కన్నతల్లి కూతురితో కలిసి తనను ఇంట్లోకి రానివ్వకుండా ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారని కరకంబాడి పంచాయతీ బీసీ కాలనీకి చెందిన సిద్ధార్థ ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం కరకంబాడి బీసీ కాలనీలోని తమ ఇంటి ముందు నిలబడి మీడియాకి తన గోడును తెలిపాడు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ 2016 నుంచి కష్టపడి ఒక ఇంటిని నిర్మించుకోవడం ప్రారంభించామని అయితే 2021లో ఇంటికి సంబంధించిన మెటీరియల్‌ తీసుకురావడానికి వెళుతుండగా తిరుపతిలోని రమీ గెస్ట్‌లైన్‌ హోటల్‌ సమీపంలో తాను రోడ్డు ప్రమాదంలో గాయపడ్డానన్నాడు. దీంతో సుమారు ఆరు నెలల పాటు స్పృహ సరిగ్గా లేక ఎక్కడ ఉన్నానో కూడా తెలియని స్థితిలో గడిపానని తెలిపాడు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇంటికి వచ్చేసరికి తాను నిర్మించుకున్న ఇంట్లోనే తనకు చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎవరు స్పందించలేదని ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరారు.

ఆహారభద్రతా నియమాలు పాటించండి

తిరుపతి అర్బన్‌: ఆహారభద్రతా నియమాలు పాటించకుండా కల్తీ పదార్థాలను విక్రయిస్తూ ఇష్టారాజ్యంగా ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడితో జరిమానాతోపాటు కేసులు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు వెల్లడించారు. బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు కలెక్టరేట్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పలు వ్యాపారుల షాపుల్లో తనిఖీల నేపథ్యంలో 15 మందిపై కేసులు నమోదు చేయడంతోపాటు వారికి రూ.3.88 లక్షలు జరిమానా విధించినట్లు జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ వెంకటేశ్వరరావు జేసీకి తెలిపారు. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుపతిలో గోలీ సోడాలు తయారు చేస్తున్న వ్యాపారికి రూ.30 వేలు, సూళ్లూరుపేటలో రంగు కలిపిన చకోడీలు తయా రీ చేస్తున్న వ్యాపారికి రూ.25 వేలు, పలు రెస్టారెంట్లలో నాణ్యత లేని పెరు గు విక్రయించినందుకు ఒక్కో రెస్టారెంట్‌కు రూ.30 వేలు చొప్పున జరిమాన విధించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement