పెళ్లకూరు: స్వర్ణముఖినదిలో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నందుకు తప్పుడు కేసులు నమోదు చేసి, అరెస్టు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు బెయిల్‌పై బుధవారం విడుదలయ్యారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతల కుటుంబాలు సంబరాలు చేసుకున్నాయి. గత నెల 14వ తేదీన కలవకూరు వద్ద స్వర్ణముఖినదిలో ఇసుక అక్రమ తవ్వకాలను సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి వైఎస్సార్ సీపీ నేతలు, పలువురు రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కూటమి నాయకుల ఒత్తిడి, పోలీసులు అత్యుత్సాహంతో 26 మందిపై అక్రమ కేసులు పెట్టారు. వీరిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డి, నాయకులు ఎద్దల నారాయణరెడ్డి, అన్నంరెడ్డి సురేష్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, గోపాలయ్య, శ్రీనివాసులు మొత్తం 12మందిని 22రోజులుగా నెల్లూరు సబ్ జైల్లో రిమాండ్‌లో ఉంచారు. వీరిలో సత్యనారాయణరెడ్డి మినహా మిగిలిన 11మంది బెయిల్‌పై విడుదలయ్యారు. వారంతా ఇళ్లకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు అనందంతో పొంగిపోయారు. సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య, యాదవ్ బాలప్రసాద్, గురవయ్య, వెంకటేశ్వర్లు తదితరులు శేఖర్‌రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనను పూలమాలలతో సత్కరించారు.
కేజీబీవీ దరఖాస్తు గడువు పెంపు
వెంకటగిరి రూరల్ : వెంకటగిరి మండలంలోని వల్లివేడు సమీపంలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రవేశ దరఖాస్తు గడువు పొడగించినట్లు ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ షాహీనభాను బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి 6, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ గ్రూపులకు 40 చొప్పున సీట్లు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. బడిబయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడిమానివేసిన వారు), పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ద్వారా అడ్మిషన్‌కోసం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలియజేశారు. మరిన్ని వివరాలకు 96186 56138ను సంప్రదించాలని సూచించారు.


