రాపూరు:గంజాయిని విక్రయించినా, సాగు చేసినా, అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్, ఎకై ్సజ్ చిత్తూరు, డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ విజయశేఖర్ తెలిపారు. రాపూరు మండలం బొజ్జనపల్లి పంచాయతీలోని రాంకీ కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కర్మాగారంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని 14 ఎకై ్సజ్ స్టేషన్లలో 122 కేసుల్లో పట్టుబడిన 625కిలోల 773 గ్రాముల గంజాయిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం కాల్చివేసినట్లు తెలిపారు. గంజాయిని సాగు, అక్రమ రవాణ చేసినా చట్టరీత్యా నేరమన్నారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, తిరుపతి ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్లు శ్రీనివాసాచారి, కడప చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపతి జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి నాగమలేశ్వరరెడ్డి, నెల్లూరు జిల్లా పొల్యూషన్ బోర్డ్ అనలిస్ట్ శర్మ, కోస్టల్ వేస్టేమేనేజ్ మెంట్ మేనేజర్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


