శ్రీకాళహస్తి: పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలోని శ్రీచైతన్యస్కూలు విద్యార్థులు అమెరికా ఎన్‌ఎస్‌ఎస్ అంతరిక్ష స్థావర (నాసా స్పేస్ సెటిల్మెంట్) పోటీల్లో ప్రతిభను చాటి, విజేతలుగా నిలిచారు. కాన్‌టెస్ట్–2026లో ఈ అద్భుతమైన విజయంతో ప్రపంచ స్థాయిలో శ్రీచైతన్య విద్యార్థులు తమ మేధస్సు, కృషి, పట్టుదలను చాటి చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రూపాదేవి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు చేసిన ఎంపీరియా–ఇన్(స్పేస్ హోటల్) ప్రాజెక్టు వరల్డ్ మెరిట్ ప్రైజ్ సాధించడం తమ పాఠశాల గర్వించదగ్గ విషయం అని తెలిపారు. ఈ పోటీల్లో 31 దేశాలు పాల్గొనగా 134 విన్నింగ్ ప్రాజెక్టుల్లో 80 అవార్డులు భారత్ చేజిక్కించుకోగా అందులో 57 అవార్డులు శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులవే కావడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. ఏజీఏం సురేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో తమ విద్యాసంస్థలు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణంగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ త్రివేణి, ఇన్‌చార్ట్‌లు శ్రీహరి, వంశీ, నాసా ఇన్‌చార్ట్ కవిత తదితరులు పాల్గొన్నారు.


