చెక్‌ బౌన్స్‌ కేసులో నిందితుడికి జైలు | - | Sakshi
Sakshi News home page

చెక్‌ బౌన్స్‌ కేసులో నిందితుడికి జైలు

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 8:24 AM

తిరుపతి లీగల్‌: చెక్‌ బౌన్స్‌ కేసులో చిత్తూరు, కొంగారెడ్డిపల్లి, నీలా ఎన్‌ క్లేవ్‌కు చెందిన పీఎస్‌ ప్రేమ్‌కృష్ణకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమా నా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్‌ జడ్జి పి కోటేశ్వరరావు మంగళవారం తీర్పు చెప్పా రు. పాకాల మండలం, బాలిరెడ్డిగారిపల్లెకు చెంది న పి.జయ చంద్రారెడ్డివద్ద ప్రేమ్‌కృష్ణ 2017 జూన్‌ 15వ తేదీ రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దానికి గాను ప్రేమ్‌కృష్ణ ఓ ప్రో నోటును రాసి ఇచ్చాడు. ఆ సొమ్ము అసలు, వడ్డీ చెల్లించే క్రమంలో 2018 జూలై 20వ తేదీ ప్రేమ్‌కృష్ణ రూ.5 లక్షల విలువ చేసే చెక్కును జయచంద్ర రెడ్డికి ఇచ్చాడు. అతను ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్‌ అయింది. దీంతో జయచంద్రారెడ్డి కోర్టులో ప్రేమ్‌కృష్ణ పై చెక్కు బౌన్స్‌ కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రేమ్‌ కృష్ణకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

భూసేకరణ వేగవంతం చేయండి

తిరుపతి అర్బన్‌: జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జేసీ గోవిందరావుతో కలసి కలెక్టర్‌ అధికారులతో సమీక్షించారు. మాట్లాడుతూ కోర్డు కేసులకు పరిష్కారం చూపుతూ భూ సేకరణ పూర్తి చేయాలని వివరించారు. రీసర్వే పనులు, మ్యుటేషన్‌, రెవెన్యూ క్లినిక్‌ పటిష్టంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. మరోవైపు పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలకు గడువులోపు పరిష్కారం చూపాల ని వివరించారు. ఈ సమావేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు రామ్మోహన్‌, భానుప్రకాష్‌ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు భరత్‌ నాయక్‌, గీతాంజలి ల్యాండ్‌ అండ్‌ సర్వే రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అరుణ్‌ కుమార్‌, చైన్నె నేషనల్‌ హైవే పీడీ రవీంద్రనాథ్‌, శ్రీ సిటీ మేనేజర్‌ భగవాన్‌, సంబంధిత తహసీల్దార్లు, డెప్యూటీ తహసీల్దార్లు, సెక్షన్‌ అధికారులు శివప్రసాద్‌, భాస్కర్‌, శిరీష పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement