నాయుడుపేట బిరదవాడ సమీపంలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఆరు ఇళ్లను మాత్రమే అందంగా శోభాయమానంగా తీర్చిదిద్ది ౖపైపె మెరుగులు దిద్దారు. సోమవారం సీఎం చంద్రబాబు రెండు ఇళ్లకు గృహ ప్రవేశం చేయించారు. నాలుగు ఇళ్ల తాళాలను లబ్ధిదారులు అందజేశారు. అవి పోగా మిగిలిన టిడ్కో సముదాయంలోని చాలా బ్లాక్‌ల్లో పనులు పూర్తి కాలేదు. అధికారులు సీఎం చంద్రబాబు ఇళ్ల ప్రారంభం కోసం అంతా ఆర్భాటం చేశారే తప్ప, మిగిలిన ఇళ్లల్లో ఎలాంటి పనులు చేయలేదు. ఆరు ఇళ్లకు మాత్రమే మరమ్మతులు చేసి, అన్ని ఇళ్లను ప్రారంభించినట్లు హాంగామా చేశారు.


