ఏర్పేడు: వ్యాయామం దినచర్యగా మార్చుకుని క్రమం తప్పకుండా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని తిరుపతి ఐఐటీ డీన్ ప్రొఫెసర్ శశిధర్‌గుమ్మా అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఆదివారం ఉదయం ఐఐటీ క్రీడా విభాగం, ఫిట్‌నెస్ క్లబ్‌తో కలిసి ‘టైకా’ సహకారంతో 3వ ’5కే ఫిట్‌నెస్ ఫ్యూజన్ క్యాంపస్ రన్’ను నిర్వహించారు. తిరుపతి ఐఐటీ, ఐసర్ విద్యార్థులతో పాటు తిరుపతి, నాయుడుపేట, నెల్లూరు, కడప, చిత్తూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి మొత్తం 250 మంది 5కే రన్‌పోటీలలో పాల్గొన్నారు. డీన్ ప్రొఫెసర్ శశిధర్ గుమ్మా జెండా ఊపి 5కే ఫిట్‌నెస్ ఫ్యూజన్ క్యాంపస్ రన్’ ప్రారంభించారు. మొదటి ఐదు స్థానాలలో నిలిచిన వారికి ప్రోత్సాహక నగదు బహుమతులను, పతకాలను ఐఐటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.పి.కృష్ణకుమార్, క్రీడా సలహాదారు డాక్టర్ ఎస్.ఉదయకుమార్, ఐఐటీ స్పోర్ట్స్ అధికారి అయ్యప్పన్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఐఐటీ క్రీడా అధికారి డాక్టర్ అయ్యప్పన్, జూనియర్ క్రీడా అధికారులు టి. శ్రీధర్ రెడ్డి, ఎం.పవన్, ఫిట్‌నెస్ క్లబ్ సమన్వయకర్త జాషువా డేనియల్ పాల్గొన్నారు.
మహిళలు– పురుషుల విభాగంలో
మొదటి మూడు స్థానాలలో నిలిచింది వీరే
మహిళల విభాగం
1.మయూరి(నాయుడుపేట 6వ తరగతి
విద్యార్థిని) (మొదటి స్థానం)
2.నాగేశ్వరి(రెండవ స్థానం)
3. నిత్య(మూడవ స్థానం)
పురుషుల విభాగం
1.విఽ.ధనుష్ (నల్గొండ జిల్లా ముకుందపురం) (మొదటి స్థానం)
2. సికిందర్ (రెండవ స్థానం)
3. ఎల్. శివరాజ్ (మూడవ స్థానం)


