యుద్ధోన్మాదాన్ని ఆపాలి | - | Sakshi
Sakshi News home page

యుద్ధోన్మాదాన్ని ఆపాలి

Mar 30 2026 7:20 AM | Updated on Mar 30 2026 7:20 AM

– కార్మిక, ప్రజా సంఘాల నేతల డిమాండ్‌

తిరుపతి కల్చరల్‌: అమెరికా, ఇజ్రాయిల్‌ ఏకపక్ష నిర్ణయంతో ఇరాన్‌పై కొనసాగిస్తున్న దుర్మార్గమైన యుద్దోన్మాదాన్ని వెంటనే ఆపాలని పలు రాజకీయ, కార్మిక, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఆదివారం గంధమనేని శివయ్య భవన్‌లో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు పి.మురళి, వందవాసి నాగరాజు , సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ నేత వెంకటరత్నం, కాంగ్రెస్‌ పార్టీ నేత రాంభూపాల్‌రెడ్డి, ఏఐటీయూసీ, సీఐటీయూ నేతలు రాధాకృష్ణ, లక్ష్మి, మైనారిటీ నేత ఇసాక్‌, ప్రజానాట్య మండలి రాష్ట్ర నేత పెంచలయ్య, కేవీపీఎస్‌ నేత శీను, ఏవైఎఫ్‌ నేత రామకృష్ణ, మహిళా సమాఖ్య నేత జయలక్ష్మి, ఆర్‌పీఐ దక్షిణాది నేత పి.అంజయ్య, డీహెచ్‌పీఎస్‌ నేత కాళయ్య, బీసీ సంఘర్షణ సమితి నేత బి.లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించారు. అమెరికా–ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దాడులను కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం ఖండించకపోవడం చూస్తుంటే ట్రంప్‌కు మోదీ సాగిలపడినట్లు స్పష్టం అవుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో దళిత నేతలు హరిబాబు, ధనంజయులు, దేవానందం, పౌర సమాజ చైతన్య వేదిక కార్యదర్శి ఏఎన్‌.పరమేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement