ఎన్నికలు నిర్వహించే ధైర్యం ఉందా? | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు నిర్వహించే ధైర్యం ఉందా?

Mar 30 2026 7:20 AM | Updated on Mar 30 2026 7:20 AM

● ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్‌సీపీ ప్రభంజనమే ● కూటమి అరాచకాలకు ప్రజలే గుణపాఠం చెబుతారు ● వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

వెంకటగిరి(సైదాపురం): ‘మున్సిపాలిటీలో కౌన్సిలర్ల పదవీ కాలం ముగిసింది.. మరో రెండు రోజుల్లో పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉందా..?’ అని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. పట్టణంలో తాజా మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌లతో కలసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలను ఇంకా వేధిస్తున్నట్లు ఆరోపించారు. ఈ దిశగా అమరావతినే రాజధానిగా నియమించేందుకు సుమారు 5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మళ్లీ రాజధానికి భూములు కావాలంటూ రైతులను మరోసారి మోసం చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని ఎద్దేవా చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. పెన్నా నదిని కూడా తవ్వేస్తూ పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు పిటిషన్‌ దాఖలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యులు బొలిగర్ల మస్తాన్‌యాదవ్‌, నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు చిట్టేటి హరికృష్ణ, మాజీ కౌన్సిలర్లు బాలయ్య, ఆరి శంకరయ్య, పేర్నేటి సుబ్బారావు, ఆటంబాకం శ్రీనివాసులు, గోపాల కృష్ణ, పూజారి లక్ష్మి, ఉమామహేశ్వరి, కందాటి కళ్యాణి, సుభావలి, విజయలక్ష్మి, కల్లు మల్లీశ్వరి, వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు ప్రసాద్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, మన్నారపు రవికుమార్‌, వెందోటి కార్తీక్‌రెడ్డి, నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కందాటి రాజారెడ్డి, పూజారి శ్రీనివాసులు, చింతపట్ల మురళీ, మల్లిరెడ్డి, కొండూరు వెంకటరత్నంరాజు , అల్లంసాయి, కల్లు సతీష్‌, ప్రసాద్‌రెడ్డి, జనార్ధన్‌, వెందోటి బాబు, గోపాల్‌ యాదవ్‌, మోహన్‌రావు, రాంగోపాల్‌రెడ్డి, కంభం విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement