రాష్ట్ర గవర్నర్‌కు సాదర స్వాగతం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర గవర్నర్‌కు సాదర స్వాగతం

Mar 31 2026 7:14 AM | Updated on Mar 31 2026 7:14 AM

రేణిగుంట: రెండు రోజుల జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జెవీ.రమణ, రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ శ్రీ హరిరావు, శ్రీ కాళహస్తి ఆర్‌ర్డీఓ భాను ప్రకాష్‌ రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా స్వాగతం పలికారు.

ఏపీఆర్‌జేసీ దరఖాస్తుల నేడు తుది గడువు

తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు మంగళవారంతో ము గియనుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు అప్రమత్తం కావాలని అధికారులు సూచించారు. వచ్చే నెల 15న హాల్‌టికెట్లు విడుదల, అదే నెల 24వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఏపీ పాలిసెట్‌–2026కు వచ్చేనెల 4వ తేదీతో గడువు ముగియనుంది.

16 నుంచి

ఎల్‌ఎల్‌ఎమ్‌ పరీక్షలు

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌ఎమ్‌ మొదటి, మూడవ సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెల 16వ తేదీ నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వచ్చే నెల 4వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, 13వ తేదీన హాల్‌టికెట్లు విద్యార్థులకు అందించనున్నట్లు తెలియజేశారు.

యువకుడి ఆత్మహత్య

రేణిగుంట: మండలంలోని ఎల్లమండ్యం పంచాయతీ తాతయ్య కాలవకు చెందిన అనిల్‌ (25) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు గాజుల మండ్యం పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. తాతయ్య కాలవ గ్రామానికి సమీపంలోని పొలాల్లో యువకుడు ఉరివేసుకున్నాడనే సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించడంతో గాజుల మండ్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానికులను విచారించగా అనిల్‌ చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువుల వద్ద పెరిగాడని, తనకు ఎవరు లేరనే బాధతో ఆదివారం రాత్రి పొలం వద్ద ఉరి వేసుకుని ఉండవచ్చని స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement