నాగలాపురం: మండలంలోని టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో సూర్య పూజోత్స వంలో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం రవికిరణాలు గర్భాలయంలోని స్వామివారి శిరస్సును తాకాయి. అర్చకులు వేకువ జా మున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసి, సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అలయంలోని పరివార దేవతలకు అభిషేకాలు, విశేష పూజలు చేసి భక్తుల సర్వదర్శనం క ల్పించారు. అనంతరం శుక్రవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారికి అమ్మవారి మండపంలో కల్యాణోత్స వం వైభవంగా నిర్వహించారు. తొలుత టీటీ డీ తరఫున అధికారులు ఆలయ మర్యాదలతో ఆలయం చుట్టు ప్రదక్షిణ చేసి పట్టు వస్త్రాల ను సీతారాముల వారికి సమర్పించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ క ల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సూర్య భగవానుడు అస్తమించే సమయంలో రవి కిరణాలు మెల్లమెల్లగా ఆలయ ప్రధాన గోపురం నుంచి గ ర్భాలయంలోని స్వామివారి శిరస్సును తాకా యి. ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు పులకించారు. అనంతరం సూర్య కిరణాలు పయనించిన మార్గాన్ని ఆలయ పరిచారకులు పుణ్యజలంతో అభిషేకించారు. కిరణాలు స్వామివారి శిరస్సును తాకిన వెంటనే భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయం మారుమోగింది.
నేత్ర పర్వంగా తెప్పోత్సవం
సూర్యపూజ సందర్భంగా నిర్వహిస్తున్న తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజన శుక్రవారం సాయంత్రం శ్రీ దేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అనంతరం పుష్కరిణిలో తెప్పపై కొలువు దీర్చారు. స్వామివారు పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగి, భక్తులకు దర్శనమిచ్చారు. వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సూపరింటెండెంట్ మునిశంకర్, స్పెషల్ ఆఫీసర్ గోవిందరాజులు, ఆలయాధికారులు శ్రీనివాసులు, ఉదయ్ కుమార్, పాల్గొన్నారు.


