టీకాల ప్రాముఖ్యతపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

టీకాల ప్రాముఖ్యతపై అవగాహన

Mar 26 2026 7:17 AM | Updated on Mar 26 2026 7:17 AM

తిరుపతి రూరల్‌: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సెమినార్‌ హాల్‌లో వయోజన టీకాల ప్రాముఖ్యతపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ఐవీ లలితకుమారి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డా.వి.జ్యోత్స్నకల్పనా, ఎం.పల్లవి, ఆర్‌.దివ్య తిరుపతి మెడిగో హాస్పిటల్‌ వారి సహకారంతో కార్యక్రమం చేపట్టారు. మెడిగో హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.సజిత్‌ టీకాల అవసరం, వాటి ప్రాముఖ్యతను వివరించారు. మెడిగో హాస్పిటల్‌ వైద్యులు డా.వాసిరెడ్డి తేజ వయోజనులకు అందుబాటులో ఉన్న వివిధ రకాల టీకాలను వివరించారు. కార్యక్రమంలో శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఇం.ఇనీరింగ్‌, ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement