● మెడికల్‌ షాపుల పేరిట క్లినిక్‌లు ● జిల్లాలో పుట్టగొడుగుల్లా మెడికల్‌ షాపుల్లో ఆస్పత్రులు ● నకిలీ అవతారమెత్తిన కొందరు కేటుగాళ్లు ● ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న వైనం ● చోద్యం చూస్తున్న ఔషధ నియంత్రణశాఖ అధికారులు ● మామూళ్ల మత్తులో జోగుతున్న కొందరు సిబ్బంద | - | Sakshi
Sakshi News home page

● మెడికల్‌ షాపుల పేరిట క్లినిక్‌లు ● జిల్లాలో పుట్టగొడుగుల్లా మెడికల్‌ షాపుల్లో ఆస్పత్రులు ● నకిలీ అవతారమెత్తిన కొందరు కేటుగాళ్లు ● ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న వైనం ● చోద్యం చూస్తున్న ఔషధ నియంత్రణశాఖ అధికారులు ● మామూళ్ల మత్తులో జోగుతున్న కొందరు సిబ్బంద

Mar 15 2026 4:55 AM | Updated on Mar 15 2026 4:55 AM

● మెడికల్‌ షాపుల పేరిట క్లినిక్‌లు ● జిల్లాలో పుట్టగొడుగుల్లా మెడికల్‌ షాపుల్లో ఆస్పత్రులు ● నకిలీ అవతారమెత్తిన కొందరు కేటుగాళ్లు ● ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న వైనం ● చోద్యం చూస్తున్న ఔషధ నియంత్రణశాఖ అధికారులు ● మామూళ్ల మత్తులో జోగుతున్న కొందరు సిబ్బంది ● వైద్య ఆరోగ్యశాఖపై నెట్టేస్తున్న ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ● చిత్తూరు నగరంలోని సుందరయ్యవీధిలో కూడా ఓ మెడికల్‌షాపు నిర్వాహకులు షాపును అడ్డుగా పెట్టుకుని...షాపునకు లోపలి భాగంలో క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. తమిళనాడు నుంచి డాక్టర్లను రప్పించి....ఆస్పత్రిగా మార్చేశాడు. ఈ విషయం 2024లో వెలుగు చూసింది. అప్పటి డీఎంహెచ్‌ఓ తనిఖీ చేయగా..అసలు విషయాలు బయట పడ్డాయి. ఇలాంటివి చిత్తూరుతో పాటు తిరుపతి జిల్లాల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ● గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని ఓ మెడికల్‌ షాపు అడ్డాగా క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. ఆర్‌ఎంపీగా చలామణి అవుతున్న ఆ వ్యక్తి మెడికల్‌ షాపు నిర్వహణతో పాటు...లోపలే దొంగ చాటుగా వైద్యం చేయిస్తున్నారు. దీనిపై సంబంధింత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో..అప్పటి డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. వాస్తవాలను గుర్తించి నోటీసులిచ్చారు. ● తిరుపతి నగరంలోని ఎంఆర్‌పల్లిలోని ఓ మెడికల్‌ షాపు నిర్వాహకుడు బీపీ, షుగర్‌ పరీక్షలు చేస్తూ...మందులు, మాత్రలు ఇచ్చేస్తున్నాడు. ఓ 50 ఏళ్ల మహిళకు ఆ నిర్వాహకుడు బీపీ, షుగర్‌ పరీక్షించి..క్రమంగా మందులు, మాత్రలు ఇస్తూ వచ్చాడు. తీరా...బీపీ, షుగర్‌ స్థాయి భారీగా పడిపోవడంతో..కుటుంబీకులు ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటి వరకు తీసుకున్న మందులు, మాత్రలపై అక్కడి డాక్టర్లు మండిపడ్డారు. ఇలాంటి కేసులు తిరుపతి జిల్లాలో వందలకొద్ది వెలుగు చూస్తున్నాయి.

– 8లో

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026

నకిలీ డాక్టర్ల హడావుడి

కాణిపాకం/తిరుపతి తుడా : జిల్లాలో మెడికల్‌ షాపుల పేరిట నడుస్తున్న అక్రమ వైద్యం రోజురోజుకూ విస్తరిస్తోంది. మందులు విక్రయించాల్సిన మెడికల్‌ షాపులు అనుమతి లేకుండానే క్లినిక్‌లుగా మారిపోతున్నాయి. పుట్టగొడుగుల్లా పెరిగిన మెడికల్‌ షాపుల్లో కొన్నిచోట్ల చిన్న ఆస్పత్రుల్లా వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అర్హతలు లేకపోయినా..

గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు దూరంగా ఉండ టం, చిన్నపాటి సమస్యలకే గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రజలు దగ్గరలో ఉన్న మెడికల్‌ షాపులనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని కొందరు నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుని మెడికల్‌ షాపులనే క్లినిక్‌లు గా మార్చేశారు. సరైన అర్హతలు లేకపోయినా కొందరు వ్యక్తులు డాక్టర్లుగా మారి రోగులకు చికి త్స అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వేల సంఖ్యలో మెడికల్‌ షాపులు

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత కొన్నేళ్లలో మెడికల్‌ షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అధికారిక అంచనాల ప్రకారం రెండు జిల్లా ల్లో కలిపి 2500 పైగా మెడికల్‌ షాపులు ఉన్నాయి. వీటిలో దాదాపు 600 మెడికల్‌ షాపుల్లో క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం మెడికల్‌ షాపులు డాక్టర్లు సూచించిన మందులను మాత్రమే విక్రయించాలి. అయితే వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అనేక షాపులు చిన్న వైద్య కేంద్రాల్లా మారిపోయాయి.

ప్రజారోగ్యంపై ముప్పు.

అర్హతలేని వ్యక్తులు వైద్యం చేయడం వల్ల రోగుల ఆరో గ్యం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన పరీక్షలు లేకుండా మందులు ఇవ్వడం, అవసరం లేని ఇంజెక్షన్లు వేయడం వల్ల కొన్ని సందర్భాల్లో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ తక్కువ ఖర్చుతో దగ్గరలోనే చికిత్స లభిస్తుందని భావించి ప్రజలు ఈ మెడికల్‌ షాపులపై ఆధారపడుతున్నారు.

ఫార్మసీ లైసెన్స్‌ను కేవలం మందులు విక్రయించడానికి మాత్రమే పొందినా, అదే పేరుతో కొందరు క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. జ్వరం, జలుబు, కడుపు నొప్పి వంటి సాధారణ వ్యాధుల కు అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఇంజెక్షన్లు వేయడం, సైలెన్‌ లు పెట్టడం వంటి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఆర్‌ఎంపీలతో చేతులు కలిపి రోగులకు నాడీ పట్టించి మందులు ఇవ్వడం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ప్రజలు నిజమైన వైద్య సేవల నుంచి దూరమై నకిలీ వైద్యులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది.

ఔషధ నియంత్రణ శాఖపై విమర్శలు

అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ శాఖపై ఉన్నప్పటికీ, పెద్దగా చర్యలు తీసుకోవ డం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు సిబ్బంది మామూళ్ల మత్తుల్లో జోగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ క్లినిక్‌లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమది కాదని, అది వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి వస్తుందని చెబుతూ బాధ్యతను ఒక శాఖ నుంచి మరో శాఖపైకి నెట్టేస్తున్నారని స్థానికులు అంటున్నారు. జిల్లాలో మెడికల్‌ షాపుల్లో జరుగుతున్న అక్రమ వైద్యంపై అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ క్లినిక్‌లు నిర్వహిస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement