సూళ్లూరుపేట విద్యార్థినికి కాంస్య పతకం | - | Sakshi
Sakshi News home page

సూళ్లూరుపేట విద్యార్థినికి కాంస్య పతకం

Feb 27 2026 4:09 AM | Updated on Feb 27 2026 4:09 AM

సూళ్లూరుపేట విద్యార్థినికి కాంస్య పతకం

సూళ్లూరుపేట విద్యార్థినికి కాంస్య పతకం

సూళ్లూరుపేట: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్‌)కి చెందిన విద్యార్థి హనీగ్రేస్‌ ఇండియా సిల్క్స్‌ సౌత్‌ రీజినల్స్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించి కళాశాలకు ఎంతో గుర్తింపును తీసుకువచ్చిందని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌ఎల్‌బీ శంకరశర్మ అన్నారు. హైదరాబాద్‌లో ఈనెల 21 నుంచి 25 తేదీ వరకు 2025–26 ఇండియా స్కిల్స్‌ రీజినల్‌ కాంపిటీషన్‌ సౌత్‌ రీజియన్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి 62 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 23 మంది విద్యార్థులకు వివిధ రకాల పతకాలు వచ్చాయి. మాలాకరి (ప్లోరిస్టీ) విభాగంలో తమ కళాశాలకు చెందిన విద్యార్థిని వీ హనీగ్రేస్‌ కాంస్య పతకాన్ని సాధించింది. పతకంతో పాటు రూ.25 వేలు నగదు, ప్రశంసాపత్రాన్ని కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని కళాశాల అధ్యాపకబృందం, సహచర విద్యార్థులు ఆమెను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement