పంటలపై ఏనుగుల దాడులు
భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం ఎగువూ రు పంచాయతీలోని బొగ్గలవారిపల్లి గ్రామానికి సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి సోమవారం రాత్రి దూసుకొచ్చిన ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. గ్రామానికి చెందిన రైతులు నాగసిద్ధమ నాయుడు, అమరేంద్ర, విశ్వనాథ, చంద్రశేఖర్ నాయుడుకు చెందిన వరి పంటతోపాటు మామిడి, కొబ్బరి చెట్లను ఏనుగులు నాశనం చేశాయి. అలాగే పొలాల్లో ఏర్పాటు చేసిన నీటి పైపులు విరగకొట్టడంతో పాటు ఫెన్సింగ్ కూడా ధ్వంసం చేశాయి. దీంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది.
లారీ డ్రైవర్‌పై దాడి
రేణిగుంట: లారీకి పంచాయతీ గేటు కట్టాలని గొడవ చేసి, దాడి చేసినట్లు తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ వెంకట చలపతి మంగళవారం పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్ మాట్లాడుతూ ముందుగా రూ.వంద కట్టమన్నారని, తర్వాత రూ.300 కట్టమని డిమాండ్ చేశారని, డబ్బు ఇచ్చిన తర్వాత రసీదు ఇవ్వలేదని పేర్కొన్నారు. అడిగిన దానికి తనపై దాడి చేశాడని, తనకు చెవి భాగంలో గాయమైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై గాజులమండ్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
పంటలపై ఏనుగుల దాడులు


