సైట్ ఓపెన్ కావడం లేదట
చిట్టమూరు:నాకు పదేళ్లుగా వినికిడి లోపం ఉంది. ఎదుటివారి మాటలు పూర్తిగా వినిపించవు. దీంతో కూలి పనులకు వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో సదరన్ క్యాంపునకు వెళ్లి వైద్యుల వద్ద చూపించుకున్నాను. అయితే సర్టిఫికెట్ రాకపోవడంతో పింఛన్ రాలేదు. ఇటీవల జరిగిన సదరన్ క్యాంప్‌లో చూపించుకునేందుకు గ్రామ సచివాలయానికి స్లాట్ బుక్ చేసుకునేందుకు వెళ్లాను. అయితే ఎప్పుడు వెళ్లినా సదరన్ క్యాంప్ సైట్ ఓపెన్ కావడంలేదు.
– మారుబోయిన మస్తాన్, ఆరూరు, చిట్టమూరు మండలం


