ఐఐటీలో ఉత్కంఠగా స్పోర్ట్స్‌మీట్
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో జరుగుతున్న 58వ ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్‌లో నాలుగో రోజు బుధ వారం వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉత్కంఠగా సాగా యి. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా ఐఐటీ రూర్కీ నిలిచింది. దీంతో వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. కాగా చెస్, టెన్నిస్ పోటీలు కొనసాగుతున్నాయి.
వెయిట్ లిఫ్టింగ్ పోటీల చాంపియన్‌గా ఐఐటీ రూర్కి
వెయిట్ లిఫ్టింగ్ పోటీలు 60 కిలోల విభాగంలో మౌన్సోలిన్ నౌలక్ 189 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా, మొత్తం ఐదుగురు ఐఐటీ రూర్కీ క్రీడాకారులు ప్రతిభ చూపారు. అలాగే 65 కిలోల విభా గంలో ఆరుగురు, 71 కిలోల విభాగంలో ఐదుగురు, 79 కిలోల విభాగంలో ఒక్కరు, 79 ప్లస్ కిలోల విభాగంలో ఐదుగురు మొత్తం 22 మంది ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. అలాగే ఐఐటీ రోపర్ 9 మందితో రెండోస్థానం, ఐఐటీ కాన్పూర్ 8మందితో మూడో స్థానంలో నిలిచాయి. వారణాసి, బాంబే ఐఐటీల నుంచి ఐదుగురు చొప్పున, గౌహతి, ఖరగ్‌పూర్ ఐఐటీల నుంచి ఇద్దరు చొప్పున, మద్రాస్, గాంధీనగర్ ఐఐటీలు ఒక్కరు చొప్పున వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభను చూపారు. అలాగే 65కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి అభిషేక్‌కుమార్, 79 కిలోల విభాగంలో ఐఐటీ కాన్పూర్ విద్యార్థి దృవ్‌శెట్టి, 71 కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి దాస్ అ నుప్‌కుమార్, 60 కిలోల విభాగంలో ఐఐటీ రూర్కీ విద్యార్థి మౌన్సోలిన్ నౌలక్ మొదటిస్థానాల్లో నిలిచారు.
చెస్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్ మొదటి స్థానం
చెస్ పోటీల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ అద్భుతంగా ఆడి, 9.5 పాయింట్లతో టేబుల్‌లో మొదటి స్థానంలో నిలి చింది. ఐఐటీ కాన్పూర్ 9 పాయింట్లతో, ఐఐటీ బాంబే, వారణాసి 8 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో చే రువలోనే నువ్వానేనా? అంటూ పోటీ పడుతున్నా యి. 7.5 పాయింట్లతో మద్రాస్, ఇండోర్, గౌహతి కూడా పోటీలో ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ ఐఐటీ మ ద్రాస్, 2వ జనరేషన్ ఐఐటీ హైదరాబాద్‌లో కూడా ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతోంది. ఈనెల 21వ తేదీతో ఈ టోర్నీ ముగియనుంది.
ఐఐటీలో ఉత్కంఠగా స్పోర్ట్స్‌మీట్


