ఏడాదిన్నరగా తిరుగుతున్నా
చంద్రగిరి: నేను చంద్రగిరి కొత్తపేటలో నివాసం ఉంటున్నాను. వృద్ధాప్యంతోపాటు గతంలో జరిగిన ప్రమాదంలో నడుము వెన్నుపూసతోపాటు ఎడమకాలు విరిగిపోయింది. దీంతో అప్పట్లో రాడ్లు పెట్టి శస్త్రచికిత్స చేశాడు. ఏడాదిన్నర క్రితం రాడ్లు విరిగిపోవడంతో పరిస్థితి తీవ్రతరం అయ్యింది. ప్రస్తుతం నడవలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చే వికలాంగుడి సర్టిఫికెట్ కోసం ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అయినా నాకు సరిఫికెట్ రాలేదు.
– రాఘవరెడ్డి, కొత్తపేట, చంద్రగిరి


