రెండు నెలులగా తిరుగుతున్నా..
వాకాడు: నాకు చెవులు రెండు పూర్తిగా వినిపించవు. దీంతో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సదరం క్యాంపునకు దరఖాస్తు చేసుకున్నాను. అక్కడ స్లాట్ బుక్ చేసుకున్న అనంతరం ఇచ్చే రశీదు కోసం గత రెండు నెలలుగా సచివాలయం చుట్టు తిరుగుతూనే ఉన్నాను. అయినా ఏ ఆస్పత్రిలో వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలనే విషయం తెలియడం లేదు. సచివాలయం సిబ్బందిని అడిగితే మాకు ఏమి తెలియదు అని చెబుతున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. – ఉమ్మడి రమణమ్మ, గొల్లపాళెం, వాకాడు మండలం


