పీజీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలను అధికారులు ఎట్టకేలకు బుధవారం విడుదల చేశారు. రెగ్యులర్ పీజీ కోర్సులకు సంబంధించి ఎంఏ రూరల్ డెవలప్‌మెంట్, ఎకనా మిక్స్, హిందీ, టూరిజం, తెలుగు, ఎమ్మెస్సీ ఆ క్వాకల్చర్, బయోటెక్నాలజీ, ఎంకామ్‌తో పాటు ఎల్‌ఎల్‌ఎమ్ నాలుగో సెమిస్టర్ ఫలితాలను సైతం విడుదల చేసినట్లు డీన్ ఆచార్య సురేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
20న ఎస్వీయూలో జాబ్‌మేళా
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయీమెంట్ కార్యాలయంలో ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీని వాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీటెక్, పలు ఫార్మసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలోనే పేరొందిన ఎమ్‌ఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు సుమారు 300 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వ హించనున్నారని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు శనివారం 10 గంటలకు వర్సిటీలోని ఎంప్లాయీమెంట్ కార్యాలయానికి తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో చేరుకోవాలన్నారు.
మలేషియాలో ఉద్యోగావకాశాలు
తిరుపతి సిటీ: మలేషియాలో ఉన్నతవిద్యతోపాటు ఉద్యోగ అవకాశాలున్నాయని ఆ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ చి యాంగ్ కౌన్యున్ పేర్కొన్నారు. కొన్ని రోజులు గా ఎస్వీ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో ల్యాబ్ మెటీరియల్‌పై జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ చియాంగ్ కౌన్యున్ పరిశీలించారు. మెటీరియల్ సైన్స్‌పై ప్రామాణి కత కలిగిన పరిశోధనలు సాగాలని ఆకాంక్షించారు. పరిశోధనలకు కేంద్రంగా ఉండే గొప్ప ప్రయోగశాలల్లో పరికరాల పనితీరు మెరుగుపరచుకోవడం అవసరమని చెప్పారు. ఎస్వీ యూనివర్సిటీతో తాము అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ట్టు వెల్లడించారు. అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. తాను చీఫ్ ఎడిటర్‌గా ఉన్న మెటీరియల్ సైన్స్ ఇన్ సెమీ కండక్టర్ ప్రపోజల్స్ జర్నల్‌కు యూనివర్సిటీ నుంచి పరిశోధకులు శాస్త్రవేత్తలు పరిశోధన వ్యా సాలు పంపాలని కోరారు. అనంతరం ప్రొఫె సర్ చియాంగ్ కౌన్యున్‌ను శిక్షణ కార్యక్రమం కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ దేవప్రసాదరాజు శా లువ, పుష్పగుచ్చం, జ్ఞాపికతో సత్కరించారు.
శ్రీవారి సేవలో
ఉడిపి మఠం పీఠాధిపతి
తిరుమల: తిరుమలలోని శ్రీవారి బుధవారం ఉడిపిలోని సోడే వాదిరాజ మఠం పీఠాధిపతి విశ్వ వల్లభతీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. తిరుమల బేడీ ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, పోటు పేస్‌కార్ మునిరత్నం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
పీజీ ఫలితాలు విడుదల


