నాటు కోళ్లకు చికిత్స
బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని గాజులపెళ్లూరులో నాటు కోళ్లకు జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ నారాయణస్వామి చికిత్స చేశారు. అంతు చిక్కని వైరస్‌తో నాటు కోళ్లు మృతి అనే శీర్షికతో సాక్షి పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి ఏడీఏ మునిరాజా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ నారాయణస్వామి గాజులపెళ్లూరుకు వెళ్లి కోళ్లకు వైద్యం చేశారు. పెంపకందారులకు పలు సూచనలు ఇచ్చారు.
అడవిలోకి చొరబడిన
ఇద్దరి అరెస్ట్
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : అన్నమయ్య జిల్లా కోడూరు మండలం మొగిలి పెంట అటవీప్రాంతంలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. వివరాలు.. రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్‌ఐ కృపానంద, ఏఆర్‌ఎస్‌ఐ బాల చెన్నయ్య బృందం స్థానిక ఎఫ్‌వీఓ కె.విజయ కృష్ణతో కలసి కూంబింగ్ నిర్వహిస్తుండగా తిమ్మయ్యగుంట వద్ద కొందరు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను గమనించి పారిపోయేందుకు యత్నించారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గొడ్డళ్లు, రంపాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారిది తమిళనాడు జమునామత్తూరు జిల్లాగా గుర్తించారు. నిందితులను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆకతాయిలపై కేసు
నాగలాపురం: పిచ్చాటూరు మండలంలోని శేషంబేడు గ్రామంలో ఉన్న సీఎస్‌ఐ చర్చి ఆవరణలో శనివారం ముగ్గురు ఆకతాయిలు మద్యం సేవించి, స్థానిక ప్రజలను, చర్చికి వచ్చి వెల్లే భక్తులపై అల్లర్లు సృష్టించారు. ఈ మేరకు వారి పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాఘవేంద్ర తెలిపారు. ఎస్‌ఐ మాట్లాడుతూ మండలంలోని శేషంబేడు సీఎస్‌ఐ చర్చి వద్ద ముగ్గురు ఆకతాయిలు అల్లర్లు చేస్తున్నారని సమాచారం అందిందన్నారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల పై ఆకతాయిలు మద్యం మత్తులో హెడ్ కానిస్టేబల్ చంద్రబాబు, కానిస్టేబల్ కవి అరసరసన్ పట్ల దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడి బెదిరింపులకు గురిచేశారన్నారు. ఈ ఘటనపై శేషంబేడు గ్రామానికి చెందిన విజయ్, ఈసాక్, స్టాలిన్‌ను అరెస్టు చేశామని తెలిపారు.
స్వర్ణముఖిలో ఇసుక దందా
చంద్రగిరి: చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ నేతలు స్వర్ణముఖి నదిలో ఇసుక దందాకు పాల్పడుతున్నారు. మండలంలోని బీమానది, స్వర్ణముఖినది, కల్యాణి నదులతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నరసింగాపురం సమీపంలోని స్వర్ణముఖినదిలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రంగంపేటకు చెందిన ఓ టీడీపీ నేత జేసీబీ సాయంతో ఇసుక తరలించారు. భారీగా గోతులు ఏర్పడడంతో పాటు గుట్టలుగుట్టలుగా ఇసుక మేటలను నిల్వ చేసి, ఆపై ట్రాక్టర్లకు లోడ్డు చేసి తరలించారు. రాత్రి, పగలు తేడాలేకుండా సాగుతున్న ఈ దందాపై రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికై నా స్పందించి ఇసుక నిల్వలపై నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
నాటు కోళ్లకు చికిత్స
నాటు కోళ్లకు చికిత్స
నాటు కోళ్లకు చికిత్స


