‘కంట్రోల్’ తప్పిన ప్రయాణం!
తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ప్రధానంగా సెలవు రోజుల్లో రద్దీ అధికంగా ఉన్నప్పటికీ క్రమబద్ధీకరించాల్సిన కంట్రోలర్లు పట్టించుకోకపోవడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం అన్ని ప్లాట్‌ఫామ్‌లు జనంతో కిక్కిరిశాయి. ఒక వైపు సరిపడా బస్సులు లేకపోవడం.. మరోవైపు గంటల నిరీక్షణ తర్వాత సర్వీసులు వస్తుండడంతో ప్రయాణికుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. వచ్చిన బస్సులో ఎక్కేందుకు నానా అగచాట్లు వస్తున్నాయి. అయినప్పటికీ ఆర్‌టీసీ కంట్రోలర్లు.. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. – తిరుపతి అర్బన్
‘కంట్రోల్’ తప్పిన ప్రయాణం!


