ప్రతిష్టాత్మక పరీక్ష
సాక్షి నిర్వహిస్తున్న స్పెల్ బీ విద్యార్థులలోని సృజనాత్మక శక్తిని వెలికితీసే ప్రతిష్టాత్మక పరీక్షగా చెప్పవచ్చు. ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు విద్యార్థులకు ఇది మంచి అవకాశం. పోటీ ప్రపంచంలో దీటుగా నిల బ డాలంటే ఆంగ్లంపై పట్టు అవసరం. ఆ దిశగా సాక్షి మీడియా విద్యార్థులను ప్రొత్సహించడం అభినందనీయం. సెమీఫైనల్‌కు విశ్వం విద్యాసంస్థ వేదిక కావడం గర్వంగా ఉంది. – ఎన్.విశ్వచందన్‌రెడ్డి,
అకడమిక్ డైరెక్టర్, విశ్వం విద్యాసంస్థలు, తిరుపతి
కొత్త పదాలు నేర్చుకుంటున్నాడు
సాక్షి స్పెల్‌బీ పరీక్షకు హాజరుకావడంతో మా అబ్బాయి ఆంగ్ల భాషపై పట్టు సాధించి కొత్త పదాలు నేర్చుకుంటున్నాడు. పదాల ఉచ్ఛారణపై పట్టు వస్తోంది. తప్పులు లేకుండా స్పెలింగ్ లు రాసేందుకు ఈ పరీక్షలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. రెండు రౌండ్లలో అర్హత సాధించి మూడో రౌండ్ స్పెల్ బీ సెమీస్‌కు మా అబ్బాయి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. సాక్షికి ధన్యవాదాలు. – అనిత, రెండవ తరగతి విద్యార్థి
హరిన్ తల్లి, రెయిన్‌బో స్కూల్, నెల్లూరు
ప్రతిష్టాత్మక పరీక్ష


