చాలా ఉత్సాహంగా ఉంది
తిరుపతి ఐఐటీ వేదికగా జరగనున్న 58 ఐఐటీ ఇంటర్ స్పోర్ట్స్ మీట్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో నేను పోటీ పడుతున్నాను. తిరుమల వెంకన్న పాదాల చెంత ఇంత పెద్ద ఈవెంట్‌లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను.
– జ్ఞానిప్రకాష్, బీటెక్ సీఎస్‌ఈ,
విద్యార్థి, ఐఐటీ జోధ్‌పూర్, రాజస్థాన్
క్రీడల్లోనూ సత్తా చాటుతాం
ఐఐటీ విద్యార్థులంటే కేవలం పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను సమాజానికి పరిచ యం చేయటమే కాకుండా క్రీడల్లోనూ మేము ఎవరికీ తీసిపోము. ఇక్కడ ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు బాగున్నాయి.దేశంలోని అన్ని ఐఐటీల నుంచి జట్లు పోటీలో పాల్గొనడం ఛాలెంజింగ్‌గా అనిపిస్తోంది.
– పర్వేష్ జక్కర్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు,
ఐఐటీ, జోధ్‌పూర్, రాజస్థాన్
సర్వసంస్కృతుల సమ్మేళనం
మేము దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటీల్లో చదువుతు న్న భావి ఇంజినీర్లు. తిరుపతి ఐఐటీ వేదికగా జరగనున్న ఇంటర్ ఐఐటీ స్పోర్ట్స్ మీట్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చాం. మేము ప్రాక్టీ స్ ప్రారంభించాం. చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించి ఐఐటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే ప్రతిభ మాలో ఉంది. – అమన్
కుమార్ గౌతమ్, ఐఐటీ, రూర్కీ, ఉత్తరాఖాండ్,
●
చాలా ఉత్సాహంగా ఉంది
చాలా ఉత్సాహంగా ఉంది


