పరిహారం మొక్కుబడిగా ఇస్తే నష్టపోతాం
పంట నష్టపరిహారం మొక్కుబడిగా ఇస్తే భారీగా నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 30 బస్తాల లెక్కన నష్ట పరిహారం ఇస్తే తీసుకుంటామని, లేదంటే ఆత్మహత్యలకైనా సిద్ధమేనని అన్నదాతలు అంటున్నారు. ఇప్పటివరకు అయిన ఖర్చులు నష్టపరిహారంగా ఇస్తామంటే ఈ ఏడాది ఫలితం నష్టపోయినట్టే కదా! అని చెబుతున్నారు. విత్తనాలు విక్రయించిన పూజిత అగ్రో సర్వీస్ సెంటర్ యజమాని నంద్యాలలో రూ.650 బస్తా తీసుకొచ్చి రైతులకు రూ.1300 పైగా విక్రయించారు. 20 రోజులకే వెన్ను వచ్చేసిందని రైతులు గగ్గోలు పెడుతున్న విషయాన్ని అన్నపూర్ణ సీడ్ కంపెనీ నుంచి పరిహారంగా రెండు లోడ్లు విత్తనాలను కూడా తీసుకొచ్చారని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 30 బస్తాల వంతున ఈ ఏడాది గిట్టుబాటు ధర ప్రకారం నష్టపరిహారం అన్నపూర్ణ సీడ్ కంపెనీ, పూజిత ఆగ్రో సెంటర్ వారినుంచి తీసి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.


