అనురాగం పంచి..
కన్నీటిపర్యంతమవుతున్న కుటుంబసభ్యులు
కృష్ణకుమారి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమార్తె హేమమాధురి, బంధుమిత్రులు
చిత్తూరురూరల్ (కాణిపాకం): ‘ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఇద్దరే ఉన్నాం. ఇప్పుడు ఒక్కదాన్నే ఉండాలా..? యాత్రకు పోబుద్ధి లేదన్నావే. అందరొచ్చారు..లేవ య్యా’ అంటూ మృతుడు నాగేశ్వరరావు భార్య అముల్ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుక్రవారం వేకువజామున చింతూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు నగరానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అందులో నాగేశ్వరరావు(68), శ్రీకళాదేవి(64), శ్యామ ల(67) ఉన్నారు. అలాగే తవణంపల్లి మండలం, నారసింహనపల్లెకు చెందిన దొరబాబు(37)కూడా మృతి చెందారు. ఈ మృతదేహాలు శనివారం మధ్యాహ్నం ఆయా ప్రాంతాలకు చేరాయి.
ఒంటరిదాన్ని చేశావయ్యా!
చిత్తూరు నగరం, గిరింపేటలోని మరాఠి వీధికి చెందిన నాగేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన మృతదేహం చింతూరు నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు ఇంటికి చేరింది. దీంతో మరాఠి వీధి లో విషాదచాయాలు అలముకున్నాయి. ఆయన ఇంటి వద్ద బంధువులు, కుటుంబీకుల ఆర్తనాదాలు మి న్నంటాయి. భర్త మృతదేహం వద్ద భార్య అముల్‌భాయ్ గుండెలు బాదుకుంటూ రోదించడం అందరినీ క లచివేసింది. ఇన్నాళ్లు ఇద్దరున్నాం.. ఇప్పుడు ఒంటరిదాన్ని చేశావంటూ ఆమె రోదించిన తీరు గుండెలు బరువెక్కేలా చేసింది. అనంతరం 4.30 గంటలకు అంత్యక్రియలు పూర్తిచేశారు.
కొలిచి..గుండెలవిసి!
మరాఠివీధిలోని నాగేశ్వరరావు, అముల్‌భాయ్ ఆ ధ్యాత్మిక దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి సకలదేవలను పూజించేవారు. నిత్యం పూజలు చేస్తూ గడిపేవారు. దేవుడంటే అపారమైన భక్తి. ఎక్కడ పూజలు జరిగినా ముందు వరుసలో నిలిచేవాళ్లు. ఆ చింతన అయ్యప్పస్వామి భక్త భజన మండలిలో వీళ్లకు సభ్యులుగా అవకాశం కల్పించారు. దుర్గానగర్ కాలనీలో జరిగే అయ్యప్పస్వామి భజన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవారని ఆ వీధిలోని వారు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
చిత్తూరు ఆస్పత్రిలో శ్రీకళాదేవి మృతదేహం
చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శ్రీకళాదేవి మృతదేహాన్ని భద్రపరిచారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కొడుకు భసవంత్‌రెడ్డి శనివారం యూఎస్‌ఏ నుంచి స్వదేశం రానున్నారు. ఆదివారం వేకువజామున రెండు గంటలకు చిత్తూరుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు చేయనున్నట్టు ఆమె బంధువులు పేర్కొన్నారు.
శ్యామలకు తుది వీడ్కోలు
చిత్తూరు కార్పొరేషన్: చింతూరు రోడ్డు ప్రమాదంలో మరణించిన చిత్తూరుకు చెందిన ట్రాన్స్‌కో విశ్రాంత ఉద్యోగి శ్యామల(67)కు శనివారం తుది వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం అక్కడి నుంచి స్థానిక కొంగారెడ్డిపల్లెలో ఆమె తమ్ముడు విశ్రాంత ఎస్‌ఐ సదాశివంరెడ్డి నివాసం వద్దకు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. శ్యామల కుమారుడు ప్రసాద్, ఆయ న భార్య సరిత, కూతురు నీలిమ, మనవరాళ్లు యుక్త, ముక్త, దీక్షిత ఆమెను చూసి వెక్కివెక్కి ఏడ్చేశారు. టూరుకు వెళ్లకపోయినా బాగుండేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెతో ఉన్న అనుభవాలను నెమరువేసుకొని కుంగిపోయారు. పర్యాటకం అంటే ఇష్టపడే శ్యామల గత నెలలో నీలమ్మ, దీక్షితతో కలిసి సింగపూర్‌కు వెళ్లినట్లు సీనియర్ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. శ్యామల అన్నలు రామ్‌కుమార్‌రెడ్డి, సదాశివంరెడ్డి, వదినలు పుష్పలత, సంపూర్ణమ్మ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని బాధపడ్డారు.
కృష్ణకుమారి (ఫైల్)
కొడుకులు.. కూతుళ్లు.. బంధువులు.. భార్యలు.. స్నేహితులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అనురాగాల పొదరింట్లో పెనవేసుకున్న బంధాల మధ్య జీవితాన్ని నెట్టుకొచ్చారు. ఎన్నో జ్ఞాపకాలు పంచారు. కష్టసుఖాలకోర్చి బిడ్డలను పెంచి పెద్ద చేశారు. వారి బాగోగులు కళ్ల చూడకనే తీపి గురుతులను వదలి పరలోకాలకు వెళ్లిపోయారు. భర్తలేని లోటుతో కొందరు, తల్లీదండ్రిని కోల్పోయిన బాధతో పిల్లలు.. జీవిత చరమాంకంలో కుటుంబానికి బాసటగా నిలిచే పెద్దవాళ్లు.. ఇలా జిల్లాకు చెందిన ఎనిమిది మంది శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు–మారేడుమిల్లి ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరారు. వారి మృతదేహాలు శనివారం జిల్లాకు చేరాయి. వారిని చూసి బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఇందులో కొందరికి అంత్యక్రియలు నిర్వహించగా.. మరికొందరికి నేడు దహన క్రియలు పూర్తి చేయనున్నారు.
అమ్మా..నాన్నా వెళ్లిపోయారా?
పలమనేరు: చింతూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సునంద, శివశంకర్‌రెడ్డి మృతదేహాలు పలమనేరుకు చేరాయి. ఆ మేరకు వీరి అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. తల్లిదండ్రుల మృతదేహాలను చూసి ఒక్కగానొక్క కుమారుడైన వెంకటసాయి గుండెలవిసేలా రోదించాడు. ‘ఇక తనకు దిక్కెవరంటూ’ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు శివశంకర్‌రెడ్డి తల్లి ఇంద్రాణమ్మ బాధ వర్ణణాతీతంగా మారింది. ఆదివారం ఆ భార్యభర్తలకు ఒకేచోట అంత్యక్రియలు జరగేలా కుటుంబీకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పెనుమూరు(కార్వేటినగరం): మండలంలోని బలిజపల్లి గ్రామానికి చెందిన హరినాథరెడ్డి భార్య కృష్ణకుమారి మృత దేహం శనివారం స్వ గ్రామానికి చేరింది. మృతురాలికి భర్తతోపాటు ఒక్కగానొక్క కుమార్తె హేమమాధురి ఉన్నారు. ‘నాకు త్వరలో మంచి భవిష్యత్‌ను అందించాలని, ఆలయాలను దర్శించుకుని పుణ్యం సంపాదించాలని బయలుదేరిన మూడో రోజే ఆయుష్యు తీరిపోయిందా తల్లి.. ఇక అమ్మా అని ఎవరిని పిలిచేది.. ఇంత త్వరగా అమ్మ అన్న పిలుపునకు దూరమవుతానని అనుకోలేదమ్మా..’ అంటూ కుమార్తె హేమమాధురి రోదించడంతో ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. జీవనాధారం కో సం బెంగళూరులో స్థిరపడినప్పటికీ నిత్యం కు టుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఫోన్ ద్వారా సరదాగ మాట్లాకునేవారు. కృష్ణకుమారి మారేడు మిల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యు ఒడికి చేరింది.
అమ్మాయిని ఒక అయ్య చేతిలోకి పెట్టకుండానే..
‘ఒక్కగానొక్క కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించావు. ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టకుండా మృత్యుఒడిలోకి జారుకున్నావా...?. నేను ఏం చేయగలను.. నీవు లేకుండా బిడ్డను ఎలా సాకగలను’ అంటూ కృష్ణకుమారి భర్త హరినాథరెడ్డి రోదించడం అందరి కంట కన్నీళ్లు తెప్పించింది. సంతోషంగా ఉన్న కుటుంబంలో దేవుడు ఇంత విషాదాన్ని నింపుతాడా .. నీ చేతుల మీదుగా నేను వెళ్లాలనుకున్నా.. కానీ నా చేతుల మీదుగా నిన్ను సాగనంపుతానని కల్లో కూడా ఊహించ లేదు కృష్ణకుమారి’ అంటూ గుండెలవిసేల రోదించడం అందర్నీ కలచి వేసింది. అనంతరం కృష్ణవేణి అంత్యక్రియలు పూర్తి చేశారు.
అనురాగం పంచి..
అనురాగం పంచి..
అనురాగం పంచి..
అనురాగం పంచి..


