తిరుమలలో నాకాబందీ
తిరుమల : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమలలో శనివారం వేకువజాము నుంచి నాకా బందీ నిర్వహించారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ ఫారెస్ట్, బాంబు స్క్వాడ్, టీటీడీ ఫైర్ సిబ్బంది, క్రైమ్, ట్రాఫిక్ తదితర విభాగాల 82 మంది సిబ్బంది బృందాలుగా ఏర్పడి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలాజీ నగర్‌లోని సుమారు 1,043 ఇళ్లను తనిఖీ చేశారు. నివాసితుల గుర్తింపు కార్డులు, వాహన రికార్డులు పరిశీలించడంతోపాటు అనుమానిత వ్యక్తుల వేలు ముద్రలను సేకరించారు. ఓనర్లు, టెన్‌డెంట్లు వివరాలను సేకరించామన్నారు. సరైన రికార్డు లేని 13 ద్విచక్ర వాహనాలు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న 12 మంది వ్యక్తులను గుర్తించారు. అలాగే 15 గృహాల్లో నివాసేతర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మరో నాలుగు గృహాల్లో లైసెనన్స్ లేకుండా వ్యాపారాల నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఒక ఇంట్లో అనధికారికంగా కుక్కను పెంచుకున్నట్లు గుర్తించి, స్థానిక ఫారెస్ట్ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు.
గుండెపోటుతో ఏపీఎస్పీ జవాను మృతి
సూళ్లూరుపేట రూరల్: మండలంలోని ఆబాక గ్రామంలో నివాసమున్న ఏపీఎస్పీ జవాను దెయ్యాల జనార్దన్ (45) గుండెపోటుతో ఇంటి వద్ద శనివారం మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. దెయ్యాల జనార్దన్ వెంకటగిరి తొమ్మిదో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకుని శనివారం ఇంటికి వచ్చాడు. హఠాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఏపీఎస్పీ డీఎస్పీ విజయానంద్ నేతృత్వంలో పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జనార్దన్ మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. జనార్దన్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అంత్యక్రియల్లో ఏపీఎస్పీ ఎస్‌లు మురళీకృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
అంతు చిక్కని వైరస్‌తో నాటుకోళ్లు మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలో అంతు చిక్కని వైరస్ సోకడంతో వేల నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నెల రోజుల్లో మండలంలోని పలు గ్రామాల్లో వేల నాటు కోళ్లు మృతి చెందుతుండడంతో పెంపకం దార్లు లబోదిబోమంటున్నారు. దీంతో గ్రామాల్లో నాటుకోళ్లు జాడ లేకుండా పోతుంది. గాజులపెళ్లూరులో సుమారు 300కు పైగా నాటుకోళ్లు మృతి చెందాయి. ముఖ్యంగా రూ.వేలు పలికే పందెం కోళ్లు సైతం మృతి చెందడంతో భారీగా నష్టపోతున్నా రు. కోళ్లను కాపాడుకుంనేందుకు పెంపకం దార్లు నానా అవస్థలు పడుతున్నారు. వ్యాధి సోకిన కోళ్లు గంటల వ్యవధిలోనే కుప్పకూలి మృతి చెందుతున్నారు. అయినా పశు వైద్యాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
తిరుమలలో నాకాబందీ
తిరుమలలో నాకాబందీ


