పొగమంచుపై ముందస్తు చర్యలు
రేణిగుంట: స్థానిక విమానాశ్రయ పరిసరాల్లో ప్రస్తుతం పొగమంచు అధికంగా ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం విమానాశ్రయంలో ఫాగ్ ప్రిపేర్నెస్, డ్రైరన్‌ను నిర్వహించారు. ఐఎండీ, ఎయిర్‌లైన్స్, ఏఏసీ అధికారులు పాల్గొని, ఆలస్య విమానాల ప్రయాణికుల కో సం ప్రత్యేకంగా వేచి ఉండడానికి, రి ఫ్రెష్మెంట్ సదుపాయాలు సిద్ధం చేశారు. ప్రయాణికులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ భూమి నాథన్ తెలిపారు.
‘విశ్వం’కు బెస్ట్ స్కూల్
ఎక్సెలెన్స్ అవార్డు
తిరుపతి సిటీ: హైదరాబాద్ వేదికగా ఇటీవల 2025– 26 విద్యా సంవ త్సరానికి గాను తిరుప తి విశ్వం టాలెంట్ స్కూల్‌కు ‘‘బెస్ట్ అకడమిక్ ఎక్సెలెన్స్ స్కూల్’’, ‘‘బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కూల్’ అవార్డులు సొంతం చేసుకుంది. విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ విశ్వనాథ్‌రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశ్వం పాఠశాలలో నాణ్య త, నవీన బోధనా విధానాలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో రాజీలేకుండా విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేకంగా సైనిక్ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయాలు, మిలిటరీ స్కూల్స్ ప్రవేశ పరీక్షలకు సమగ్ర శిక్షణ అందిస్తూ, విద్యార్థులను చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణా లు, దేశభక్తి భావాలను అలవరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
రుక్మిణీపాండురంగస్వామి ఆలయంలో చోరీ
కలువాయి(సైదాపురం): కలువాయిలోని రుక్మిణీపాండురంగస్వామి ఆలయంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగలు చోరీకి పాల్పడ్డారు. దుండగులు ఆలయ తాళలు రంపంతో కట్‌చేసి ఆలయంలోని అమ్మవార్ల రెండు మంగళ సూత్రాలు, హుండీలో సొత్తు అపహరించినట్లు ఆలయ పూజారి నాగభూషణం తెలిపారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మఠం భూమిలో
ఇరువర్గాల ఘర్షణ
తిరుపతి రూరల్: హథీరాంజీ మఠం భూమిలో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం భౌతిక దాడులకు దారితీసింది. స్థానికుల కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రెండు వర్గాల వారు తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వేనంబర్ 13లోని హథీరాంజీ మఠం భూముల్లో జరిగే అక్రమ కట్టడాలపై శనివారం సాయంత్రం ఘర్షణ పడ్డారు. స్వల్ప వివాదం తలెత్తడంతో ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒక్కసారిగా కర్రలు, మద్యం బాటిళ్లతో దాడులకు తెగబడి, అరుపులతో భయానక వాతావరణం కల్పించారు. దీంతో స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వగా తిరుపతి రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.
పొగమంచుపై ముందస్తు చర్యలు


