జాతీయ జూడో పోటీలకు ఎస్వీజేసీ విద్యార్థులు
తిరుపతి సిటీ: రాజస్థాన్ వేదికగా ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న జాతీయ బ్‌లైండ్ జూడో చాంపియన్ పోటీలకు తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం కళాశాల ప్రిన్సిపల్ సి ప్రకాష్ బాబు జాతీయ పోటీలకు ఎంపికై న పి యశ్వంత్‌రెడ్డి, బీ అంజి, వీ నవీన్, ఏ జీవన్ బాబు, ఎమ్ అంజిని ప్రత్యేకంగా అభినందించారు.
14న అండర్–12 బాయ్స్ క్రికెట్ జట్టు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : అండర్–12 బాయ్స్ క్రి కెట్ జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఈ నెల 14వ తేదీ ఉదయం 9గంటలకు నిర్వహించ నున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసి యేషన్ (సీడీసీఏ) కార్యదర్శి మందపాటి స తీష్‌యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక పోటీలను తిరుపతి, చిత్తూరు, పీలేరులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి డి విజన్‌కు సంబంధించి మంగళం రోడ్డులోని సీ వీ క్రికెట్ అకాడమీలో, చిత్తూరు డివిజన్‌కు సంబంధించి చిత్తూరులోని పోలీస్ గ్రౌండ్‌లో, మదనపల్లి డివిజన్‌కు సంబంధించి పీలేరు లోని పీఐఓసీ క్రికెట్ నెట్స్‌లో ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రికెటర్లు 01–09–2013 సెప్టెంబర్ ఒ కటో తేదీలోపు జన్మించిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వారి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఎంపిక ప్రక్రియ ప్రాంగణంలో తెల్లని దుస్తులు, సొంత క్రీడా సామగ్రి, ఆధార్‌కార్డు, బర్త్ సర్టిఫికెట్లతో హాజరుకావాల న్నారు. వివరాలకు 8886185559, 90002 14966 నంబర్లలో సంప్రదించాలన్నారు.
యూరియా కొరత లేదు
తిరుపతి అర్బన్: జిల్లాకు యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్‌రావు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎరువుల దుకాణయజమానులు కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే వారిపై చట్టపరమైన చర్య లు తప్పవని హెచ్చరించారు. రబీ సీజన్‌కు 62 వేల మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. నెలల వారీగా యూరియాను రైతులకు అవసరం అయిన మేరకు తెప్పించి ఇస్తున్నట్లు తెలిపారు.
జాతీయ పోటీలకు జిల్లా షూటర్లు
తిరుపతి ఎడ్యుకేషన్ : న్యూఢిల్లీ, భోపాల్ నగరా ల్లో ఈ నెల 14నుంచి జనవరి 4వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి షూటింగ్ చాంపియన్ షి ప్ పోటీల ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఐదుగురు షూటర్లు అర్హత సాధించారు. వీరిలో ఎం.అద్భుత వైష్ణవి, ఎ.హారిక, పి.హితేష్ ఎయిర్ ఫిస్టల్ విభాగంలో, ఎన్.సుష్మ, బి.నందగోపాల్ ఎయిర్ రైఫిల్ విభాగాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గురువారం తిరుపతిలోని శ్రీనివాస స్పో ర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో వారిని డీఎస్‌డీఓ శశి ధర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా రైఫిల్ షూటింగ్ సంఘం అధ్యక్షుడు దేవరాజ్ అభినందించారు.
చిత్తూరు కార్పొరేషన్: ఉ మ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా రెడ్డివారిగురువారెడ్డిని(టీడీపీ)ని ని యమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం, బందారపల్లెకు చెందిన ఆయన్ను చైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు.
జాతీయ జూడో పోటీలకు ఎస్వీజేసీ విద్యార్థులు
జాతీయ జూడో పోటీలకు ఎస్వీజేసీ విద్యార్థులు


