అమ్మవారి సేవలో మంత్రాలయం పీఠాధిపతి
చంద్రగిరి: పద్మావతి అమ్మవారిని మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామి తన శిష్య బృందంతో కలసి గురువారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ అమ్మవారిని దర్శించుకున్నారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
చంద్రగిరి: నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థి మూడో అంతస్తు నుంచి కిందపడిన ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఎన్‌ఎస్‌యూఐ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాయలసీమ అధ్యక్షుడు విజయ్ ఉత్తరాది, విద్యార్థి నాయకుడు కుమార్‌లతో కలసి గురువారం కళాశాల వద్దకు వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడే నిరసన వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్ని ఈ ఘటనపై నిలదీశారు. అనంతరం వారు మాట్లాడుతూ దుర్ఘటనలో అనేక అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. విద్యార్థి భవిష్యత్తు ప్రమాదంలో పడేలా కాలేజీ వ్యవస్థ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమ్మవారి సేవలో మంత్రాలయం పీఠాధిపతి
అమ్మవారి సేవలో మంత్రాలయం పీఠాధిపతి


