టీటీడీకి రెండు ఈవీ కార్లు విరాళం
తిరుమల : తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో అర్జున్ కొల్లికొండ అనే భక్తుడు బుధవారం టీటీడీకి రూ.10 లక్షల విలువైన సిట్రాఝెన్ (ఈసీ3) ఎలక్ట్రిక్ కారును విరాళంగా అందించింది. అదేవిధంగా చైన్నెకి చెందిన శరవనన్ కరుణాకరన్ అనే భక్తుడు రూ.9 లక్షలు విలువైన సిట్రాఝెన్ (బసాల్ట్ ఎక్స్ ప్లస్ యంటీ) కారును విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయం ముందు కార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పేష్కార్ రామకృష్ణకు తాళాలు అందించారు.
మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించాలి
వరదయ్యపాళెం: మహిళలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు ఆకాంక్షించారు. బుధవారం పిచ్చాటూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో విజన్ బిల్డింగ్, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధి గ్రామీణ ఆర్థిక పురోగతికి పునాది అన్నారు. డీపీఎం వెంకటేష్, ఏపీఎంలు రాధమ్మ, చంద్రబాబు పాల్గొన్నారు.


