ప్రశాంతంగా మొదటి రోజు టెట్
తిరుపతి సిటీ : జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు టెట్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షల నిర్వహణలో భాగంగా జిల్లాలోని 9 పరీక్షా కేంద్రాలల్లో ఉదయం సెషన్‌లో 714 మంది హాజరు కావాల్సి ఉండగా 659 మంది హాజరయ్యారు. 55 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన రెండవ సెషన్ టెట్‌కు 297 మంది హాజరు కావాల్సి ఉండగా 260 మంది మాత్రమే హాజరయ్యారు. ఇందులో 37 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరును పక్కాగా చేపట్టామని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలల్లో తాగునీటితో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని తెలియజేశారు.


