భారత్ జట్టులో ఆంధ్రా క్రీడాకారులు
తిరుపతి ఎడ్యుకేషన్ : గోల్ షాట్ బాల్ భారత సీ్త్ర, పురుషుల జట్టులో నలుగురు ఆంధ్ర క్రీడాకారులు చోటు సాధించారు. ఆ మేరకు గోల్ షాట్ బాల్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.మురళి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 15వ తేదీన పంజాబ్‌లో నిర్వహించిన గోల్‌షాట్ బాల్ భారత జట్టు ఎంపిక పోటీల్లో సీ్త్రల విభాగంలో తిరుపతి జిల్లా నెరబైలుకు చెందిన దేవిప్రియ, అనంతపురం జిల్లాకు చెందిన సభాఖానం, గుంటూరు జిల్లాకు చెందిన ప్రజ్ఞ, పురుషుల విభాగంలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రాచవీటి తేజేంద్రలు ప్రతిభ కనబరచి భారత జట్టులో చోటు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 15నుంచి 19వ తేదీ వరకు నేపాల్ దేశం, ఖాట్మాండ్‌లో నిర్వహించే సౌత్ ఏషియస్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపా రు. రాష్ట్ర క్రీడాకారులు భారత్ జట్టులో స్థానం సాధించి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం మనకు గర్వకారణమని, అంతర్జాతీయ స్థాయిలోనూ ఉత్తమ ప్రదర్శన కనబరచి రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
శ్రీకాళహస్తిలో
ట్రాఫిక్ మళ్లింపు
శ్రీకాళహస్తి: ఏడు గంగమ్మల జాతర సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో భారీ రద్దీ నెలకొనే అవకాశం ఉండడంతో ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని తెలిపారు. ఏపీసీడ్స్ వైపు నుంచి పట్టణంలోకి వచ్చే బస్సులు, లారీలు, భారీ వాహనాలు పట్టణంలోకి నిషేధమన్నారు. బైపాస్ రోడ్డు నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నంది సర్కిల్ అక్కడి నుంచి ఎంజీఎం ఆస్పత్రి మీదుగా బస్ స్టాండ్ వైపునకు మళ్లించినట్లు తెలిపారు. అలాగే నాయుడుపేట వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు పట్టణంలోకి ప్రవేశం లేదన్నారు. నంది సర్కిల్ నుంచి ఎంజీఎం ఆస్పత్రి మీదుగా బస్టాండ్‌కు మళ్లించనున్నట్లు చెప్పారు. ఇక బస్ స్టాండ్ నుంచి పట్టణంలోకి వెళ్లే భారీ వాహనాలను పట్టణంలోకి అనుమతి లేదన్నారు. వాటిని ఎంజీఎం ఆస్పత్రి నుంచి నంది సర్కిల్, బైపాస్‌రోడ్డు మీదుగా ఏపీసీడ్స్ మార్గం వైపు మళ్లించినట్లు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల వాహనాలు ప్రత్యేక అనుమతితో ఏపీసీడ్స్ కూడలి, పొన్నాలమ్మ గుడి మీదుగా నేరుగా ఆలయ వైపు వెళ్లడానికి అనుమతించిన్నట్లు తెలిపారు.
జాతీయ పోటీలకు
ఎస్పీడబ్ల్యూ విద్యార్థినులు
తిరుపతి సిటీ: కలకత్తా వేదికగా వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు పద్మావతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికయారు. గత నెల కాకినాడ వేదికగా జరిగిన అంతర్‌జిల్లాల అండర్–19 సిమ్నాస్టిక్ పోటీల్లో ఎస్పీడబ్ల్యూ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ప్రతిభ చూపి జాతీయ పోటీలకు ఎంపికై న విద్యార్థినులను ప్రిన్సిపల్ డాక్టర్ సి భువనేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై వారిలో ఎస్ ధరణి, గంగాభవాని, చైతన్యశ్రీ, యామిని ఉన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ సాయి సుమతి, అధ్యాపకులు పాల్గొన్నారు.


